Telugu Global
International

ఫైలట్‌ అభినందన్‌ విడుదలలో మరో మలుపు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ అభినందన్‌ను నేడు విడుదల చేస్తామని పాకిస్థాన్‌ ప్రకటించింది. మధ్నాహ్నం రెండు తర్వాత అభినందన్‌ను పాక్‌ అధికారులు… భారత అధికారులకు అప్పగించనున్నారు. అయితే అభినందన్‌ను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌ సుప్రీం కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. దేశంపై దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తిని ఎలా తిరిగి అప్పగిస్తారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ పిటిషన్లను విచారించే విషయంలో ఇంకా అక్కడి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  

ఫైలట్‌ అభినందన్‌ విడుదలలో మరో మలుపు
X

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ అభినందన్‌ను నేడు విడుదల చేస్తామని పాకిస్థాన్‌ ప్రకటించింది. మధ్నాహ్నం రెండు తర్వాత అభినందన్‌ను పాక్‌ అధికారులు… భారత అధికారులకు అప్పగించనున్నారు.

అయితే అభినందన్‌ను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌ సుప్రీం కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.

దేశంపై దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తిని ఎలా తిరిగి అప్పగిస్తారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ పిటిషన్లను విచారించే విషయంలో ఇంకా అక్కడి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  1 March 2019 12:32 AM GMT
Next Story