ఒక్క పాట కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టిన దిల్ రాజు

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా సాగుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన టైటిల్ సాంగ్ ని కంపోస్ చేసాడట దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈ పాటని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకేక్కించాలనేది వంశీ పైడిపల్లి ప్లాన్. ఈ పాట కోసం దిల్ రాజు దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాడని టాక్.

ఎందుకంటే మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. అలాగే “మహర్షి” ఇంట్రడక్షన్ సాంగ్ ని కూడా హై రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేశాడట దిల్ రాజు. దిల్ రాజు తో పాటు అశ్విని దత్ మరియు పివిపి సంస్థ కూడా ఈ సినిమాని కలిసి నిర్మిస్తున్నారు.