Telugu Global
National

చందాకొచ్చార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చార్‌తో పాటు వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ దూత్ ఇండ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. వీడియోకాన్ సంస్థకు 2012లో 3250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో క్విడ్-ప్రోకోకు పాల్పడ్డారంటూ చందాకొచ్చార్‌పై ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ ఆమెను సీఈవోగా తొలగించింది. ఈ రుణాలు ఇచ్చినందుకు ప్రతిగా చందాకొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్‌కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్ పెట్టుబడి పెట్టినట్లుగా […]

చందాకొచ్చార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ
X

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చార్‌తో పాటు వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ దూత్ ఇండ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.

వీడియోకాన్ సంస్థకు 2012లో 3250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో క్విడ్-ప్రోకోకు పాల్పడ్డారంటూ చందాకొచ్చార్‌పై ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ ఆమెను సీఈవోగా తొలగించింది. ఈ రుణాలు ఇచ్చినందుకు ప్రతిగా చందాకొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్‌కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్ పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. అంతే కాకుండా భారత ప్రభుత్వం చందా కొచ్చార్, వేణుగోపాల్‌లపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

First Published:  1 March 2019 2:31 AM GMT
Next Story