Telugu Global
NEWS

హైదరాబాద్ వన్డేకి రాజీవ్ స్టేడియంలో అంతా సిద్ధం

ఆతిథ్య టీమిండియాకు ఆస్ట్రేలియా సవాల్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఐదేళ్ల తర్వాత తొలివన్డే ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ కు…హాట్ ఫేవరెట్ టీమిండియా సన్నాహాలు ఆఖరి అంకానికి చేరాయి. ఆస్ట్రేలియాతో ఐదుమ్యాచ్ ల సన్నాహక సిరీస్ లో భాగంగా….హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా శనివారం జరిగే తొలివన్డేలో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు..రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ నెగ్గిన జోష్ తో…కంగారూ టీమ్ సవాలు విసురుతోంది. […]

హైదరాబాద్ వన్డేకి రాజీవ్ స్టేడియంలో అంతా సిద్ధం
X
  • ఆతిథ్య టీమిండియాకు ఆస్ట్రేలియా సవాల్
  • హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఐదేళ్ల తర్వాత తొలివన్డే

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ కు…హాట్ ఫేవరెట్ టీమిండియా సన్నాహాలు ఆఖరి అంకానికి చేరాయి. ఆస్ట్రేలియాతో ఐదుమ్యాచ్ ల సన్నాహక సిరీస్ లో భాగంగా….హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా శనివారం జరిగే తొలివన్డేలో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు..రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ నెగ్గిన జోష్ తో…కంగారూ టీమ్ సవాలు విసురుతోంది. ఇప్పటికే రెండుజట్ల సభ్యులు… రాజీవ్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ ను ముగించారు.

రాజీవ్ స్టేడియం వేదికగా …ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన.. రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ టీమిండియా ఓటమి పొందటం విశేషం. డే-నైట్ గా జరిగే ఈ పోటీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ గడ్డపై తొలివన్డే….

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐదేళ్ల విరామం తర్వాత…వన్డే మ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది.

2019 వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి సమరానికి రాజీవ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. డే-నైట్ గా జరిగే ఈ పోటీలో 6వ ర్యాంకర్ ఆస్ట్రేలియాపై…2వ ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

అయితే…రాజీవ్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ టీమిండియాకు ఓటమిరికార్డే ఉంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు… ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలోని కంగారూటీమ్ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆతిథ్య టీమిండియాకు రాజీవ్ స్టేడియంలో రెండు విజయాలు, 3 పరాజయాల రికార్డు మాత్రమే ఉంది.

రాజీవ్ స్టేడియంలో హైసెక్యూరిటీ…

రాజీవ్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే వన్డే మ్యాచ్ కు…హైదరాబాద్ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, వెలుపలా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది భద్రతాసిబ్బంది…భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా మూడోసారి ఓ వన్డే మ్యాచ్ లో టీమిండియా ప్రత్యర్థిగా ఢీకొనబోతోంది. 2005లో టీమిండియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆసీస్…2007 సిరీస్ లోని వన్డేలో సైతం ఆతిథ్య భారత్ ను 47 పరుగుల తేడాతో ఓడించి…రెండు కు రెండుమ్యాచ్ ల రికార్డును పూర్తి చేసింది.

First Published:  1 March 2019 6:59 AM GMT
Next Story