Telugu Global
Cinema & Entertainment

"ఇస్మార్ట్ శంకర్" కి అంత వాల్యూ ఉందా ?

హిట్ డైరెక్టర్ నుంచి ఫ్లాప్ డైరెక్టర్ లిస్టు లోకి పడిపోయిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం హీరో రామ్ తో “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని పూరి టూరింగ్ టాకీస్ పై ఛార్మి ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఇప్పటి నుంచే మంచి బిజినెస్ వస్తుంది. కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఈ […]

ఇస్మార్ట్ శంకర్ కి అంత వాల్యూ ఉందా ?
X

హిట్ డైరెక్టర్ నుంచి ఫ్లాప్ డైరెక్టర్ లిస్టు లోకి పడిపోయిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం హీరో రామ్ తో “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని పూరి టూరింగ్ టాకీస్ పై ఛార్మి ప్రొడ్యూస్ చేస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఇప్పటి నుంచే మంచి బిజినెస్ వస్తుంది. కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని పది కోట్లకంటే తక్కువకి ఇవ్వనని తెగేసి చెబుతున్నాడ. ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాధ్, అస్సలు మార్కెట్ లేని రామ్ కి పది కోట్లు అంటే మరి ఎక్కువే అని టీవి ఛానల్స్ వారు అంటున్నారట.

అయితే పూరి ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం వెనక రామ్ పెద్ద నాన్న స్రవంతి రవి కిషోర్ హస్తం కూడా ఉందనేది తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రెండో పార్ట్ గా “డబుల్ ఇస్మార్ట్ శంకర్” అనే కథ కూడా రెడీ చేస్తున్నాడు పూరి జగన్నాధ్.

First Published:  1 March 2019 4:37 AM GMT
Next Story