Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్న మహి వి రాఘవ్

“ఆనందో బ్రహ్మ” అనే హారర్ కామెడీ తో హిట్ కొట్టిన దర్శకుడు మహి వి రాఘవ్. ఆ సినిమా తరువాత ఈ డైరెక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా “యాత్ర” అనే బయోపిక్ ని డైరెక్ట్ చేశాడు. ఈ బయోపిక్ రిలీజ్ అయిన రోజు నుంచే మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ పాత్రని మమ్ముటి పోషించాడు. ఈ సినిమా కేవలం పాదయాత్ర బ్యాక్ డ్రాప్ లో మాత్రమే తెరకెక్కింది. ఇదిలా ఉంటే […]

వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్న మహి వి రాఘవ్
X

“ఆనందో బ్రహ్మ” అనే హారర్ కామెడీ తో హిట్ కొట్టిన దర్శకుడు మహి వి రాఘవ్. ఆ సినిమా తరువాత ఈ డైరెక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా “యాత్ర” అనే బయోపిక్ ని డైరెక్ట్ చేశాడు. ఈ బయోపిక్ రిలీజ్ అయిన రోజు నుంచే మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ పాత్రని మమ్ముటి పోషించాడు. ఈ సినిమా కేవలం పాదయాత్ర బ్యాక్ డ్రాప్ లో మాత్రమే తెరకెక్కింది.

ఇదిలా ఉంటే మహి వి రాఘవ్ తన తదుపరి సినిమాని మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు మహి వి రాఘవ్…. దుల్కర్ ని కూడా కలిసి కథ చెప్పాడని తెలుస్తుంది.

కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో ఒక వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడట మహి. ఈ వెబ్ సీరిస్ కోసం ప్రస్తుతం మహి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో బిజీ గా ఉన్నాడు. ఈ సీరిస్ ని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుంది.

First Published:  1 March 2019 6:03 AM GMT
Next Story