అవును… మసూద్‌ మా వద్దే ఉన్నాడు – పాక్ సంచలన ప్రకటన

ఉగ్రవాద సంస్థ జైషే ఏ మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజర్‌ తమ దేశంలోనే ఉన్నారని పాకిస్థాన్ అంగీకరించింది. ఈమేరకు పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ప్రకటన చేశారు. అయితే మసూద్‌ను అరెస్ట్ చేసేందుకు మాత్రం నిరాకరించారు. మసూద్‌ను అరెస్ట్ చేయాలంటే అతడికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉండి తీరాల్సిందేనన్నారు.

మసూద్‌ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తొలగి సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో తాను చర్చలు జరపలేనన్నారు.

దుబాయ్‌లో ఓఐసీ సదస్సు సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో తాను భేటీ కాలేనని ఖురేషి చెప్పారు.