Telugu Global
NEWS

జగన్ వ్యూహంతో చంద్రబాబులో అలజడి!!

యుద్ధంలో సొంత బలాన్ని చూసి మురిసిపోవడం కాదు ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేయడం యుద్ధరచనలో ఓ భాగం. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యూహం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని పార్టీ నాయకులే అంటున్నారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి నెట్టాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహం. ఆ దిశగానే ఆయన […]

జగన్ వ్యూహంతో చంద్రబాబులో అలజడి!!
X

యుద్ధంలో సొంత బలాన్ని చూసి మురిసిపోవడం కాదు ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేయడం యుద్ధరచనలో ఓ భాగం. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యూహం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని పార్టీ నాయకులే అంటున్నారు.

ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి నెట్టాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహం. ఆ దిశగానే ఆయన పావులు కదపడం ప్రారంభించారు. జనవరి నెలలోనే శాసనసభ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆ పని ఎందుకు ప్రారంభించాను అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.

మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారంలోనూ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కట్టడి చేయవచ్చునని చంద్రబాబు నాయుడు వ్యూహం. అయితే ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి ప్రతి వ్యూహాన్ని అద్భుతంగా రచిస్తోంది.

చంద్రబాబు ఆలోచనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా అభ్యర్థుల సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం.

తెలుగుదేశం పార్టీలో టికెట్లు రానివారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం… లేదూ ఎన్నికలలో తమకు అనుకూలంగా పని చేయడం జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. గత వారంరోజులుగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఈసారి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడుకు ఈ కొత్త పరిణామాలతో దిమ్మ తిరుగుతుంది అంటున్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో తన వ్యూహం ఇలా బెడిసి కొట్టడం చంద్రబాబు నాయుడుకి జీర్ణం కావటం లేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో చంద్రబాబు నాయుడు కొట్టుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

First Published:  1 March 2019 3:23 AM GMT
Next Story