Telugu Global
International

ఇప్పుడు ఇదే ట్రెండ్... అభినందన్ 'గన్ స్లింగర్'

సెలబ్రిటీలను అనుసరించడం ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయమే. ఇండియాలో కూడా తమ అభిమాన నటులు, ఆటగాళ్ళ మాదిరిగా స్టైల్స్ మారుస్తూ యువత తమ అభిరుచులను చాటుకుంటారు. ఇప్పుడు ఇండియన్ మీసకట్టులో సరికొత్త ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇది ఏ సినిమా నటుడో, సెలబ్రిటీనో చూసి ఫాలో అయ్యింది కాదు. మన రియల్ హీరో అభినందన్ వర్ధమాన్‌ను చూసి అనుసరిస్తోంది. అభినందన్ పెదాలపై చిరునవ్వుతో పాటు ఒడుపుగా తీర్చిదిద్దిన మీసకట్టుకు దేశవ్యాప్తంగా ఆకర్షణ మొదలైంది. తమిళనాడులో ఎక్కువగా అనుసరించే […]

ఇప్పుడు ఇదే ట్రెండ్... అభినందన్ గన్ స్లింగర్
X

సెలబ్రిటీలను అనుసరించడం ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయమే. ఇండియాలో కూడా తమ అభిమాన నటులు, ఆటగాళ్ళ మాదిరిగా స్టైల్స్ మారుస్తూ యువత తమ అభిరుచులను చాటుకుంటారు. ఇప్పుడు ఇండియన్ మీసకట్టులో సరికొత్త ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇది ఏ సినిమా నటుడో, సెలబ్రిటీనో చూసి ఫాలో అయ్యింది కాదు. మన రియల్ హీరో అభినందన్ వర్ధమాన్‌ను చూసి అనుసరిస్తోంది.

అభినందన్ పెదాలపై చిరునవ్వుతో పాటు ఒడుపుగా తీర్చిదిద్దిన మీసకట్టుకు దేశవ్యాప్తంగా ఆకర్షణ మొదలైంది. తమిళనాడులో ఎక్కువగా అనుసరించే ఈ స్టైల్‌ను ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా అనుసరించడం మొదలు పెట్టారు. ‘గన్ స్లింగర్’గా పిలుచుకుంటున్న ఈ మీసకట్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

రెండో ప్రపంచ యుద్దం సమయంలో అమెరికా తరుపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ ఇలాంటి మీసకట్టునే ఫాలో అయ్యేవాడు. ఆయనకు అమెరికా అత్యున్నత పురస్కారం ‘మెడల్ ఆఫ్ హానర్’ కూడా దక్కింది. దాన్నే ఫాలో అవుతూ అభినందన్ తన మీసకట్టును తీర్చి దిద్దుకున్నాడట. ఇప్పుడు యువత అదే ఫాలో కాబోతున్నామంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు.

First Published:  1 March 2019 11:27 PM GMT
Next Story