Telugu Global
NEWS

రాజమండ్రి ఎంపీగా గంటా ?

ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తన హవా నడిపించుకునే నాయకుడు. ఎన్నిసార్లు పార్టీలు మారినా ఆ పార్టీ అధినాయకుల ఆశీసులతో మంత్రి పదవులు పొందిన నాయకుడు. ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారా… ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనీయర్ నాయకుడు గంటా శ్రీనివాస రావు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావు ఆ పార్టీకి రాజీనామ చేసి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినా…. పార్టీ అధికారంలోకి […]

రాజమండ్రి ఎంపీగా గంటా ?
X

ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తన హవా నడిపించుకునే నాయకుడు. ఎన్నిసార్లు పార్టీలు మారినా ఆ పార్టీ అధినాయకుల ఆశీసులతో మంత్రి పదవులు పొందిన నాయకుడు. ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారా… ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనీయర్ నాయకుడు గంటా శ్రీనివాస రావు.

తెలుగుదేశం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావు ఆ పార్టీకి రాజీనామ చేసి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినా…. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఆయన అదృష్టమో మరింకే కారణమో తెలియదుగాని శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడంతో పాటు, మంత్రిపదవిని కూడా పొందారు. అయితే ఆయనకు చినబాబు రూపంలో కొత్త సమస్య ఎదురైందని అంటున్నారు.

విశాఖపట్నం జిల్లా భీమీలి శాసనసభ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస రావు ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికలలో ఆ స్దానం నుంచి పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస రావును లోక్‌సభకు పోటీ చేయిస్తే మంచిదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రాజమండ్రి లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ ఈసారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో ఆయన స్దానంలో గంటా శ్రీనివాస రావును రాజమండ్రి లోక్‌సభ స్దానానికి పోటీ చేయిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

దీని వల్ల అటు తన తనయుడు నారా లోకేష్‌ కు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని, విశాఖ భూముల కుంభకోణంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారన్న గంటా శ్రీనివాస రావును లోక్‌సభకు పంపితే ఆ ఆరోపణలను కూడా చెక్‌ పెట్టినట్లు ఉంటుందని చంద్రబాబు నాయుడు సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.

First Published:  1 March 2019 9:02 PM GMT
Next Story