Telugu Global
NEWS

శివాజీ... బాబును నమ్మకు : తెలుగు తమ్ముళ్లు

సినీ హీరో, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ కి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు తమ్ముళ్లు హితబోధ చేస్తున్నారు. నారా చంద్రబాబునాయుడిని నమ్ముకుంటే తీవ్రంగా నష్టపోతావని శివాజీని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలనైనా చేయవచ్చు….. కానీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు పడతావని హీరో శివాజీ కి తెలుగు తమ్ముళ్ళు నచ్చ చెబుతున్నారంటున్నారు. “తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో నీకు […]

శివాజీ... బాబును నమ్మకు : తెలుగు తమ్ముళ్లు
X

సినీ హీరో, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ కి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు తమ్ముళ్లు హితబోధ చేస్తున్నారు. నారా చంద్రబాబునాయుడిని నమ్ముకుంటే తీవ్రంగా నష్టపోతావని శివాజీని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలనైనా చేయవచ్చు….. కానీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు పడతావని హీరో శివాజీ కి తెలుగు తమ్ముళ్ళు నచ్చ చెబుతున్నారంటున్నారు.

“తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో నీకు ఏదో చేస్తారని, ఎమ్మెల్సీ గానో, మంత్రి పదవి లేదూ ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని ఆశిస్తున్నా రేమో. అలాంటివి ఏమీ జరగవు. గతంలో ఎందరినో వాడుకున్న చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూడా అలాగే వాడుకొని వదిలేస్తారు” అని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హీరో శివాజీ కి ఫోన్ చేసి మరీ చెబుతున్నట్లు సమాచారం.

శుక్రవారం నాడు విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిధిగా భారీ బహిరంగ సభ నిర్వహించింది.

విశాఖపట్నంలో ఈ సభ జరుగుతుండగా హీరో శివాజీ మాత్రం విజయవాడలో నల్ల వస్త్రాలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ పైనా, భారతీయ జనతా పార్టీ పైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు మద్దతుగా పలు సమావేశాల్లోను, టీవీ చర్చల్లోనూ శివాజీ చెలరేగిపోయారు.

దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు వాస్తవాలను వెల్లడిస్తూ శివాజీకి జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగోలేదని, తెలుగుదేశం అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమని, ఈ విషయాలను గుర్తెరిగి ప్రవర్తించాలంటూ శివాజీకి హిత బోధ చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని బీజేపీ పైనా… వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా విమర్శలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు అని సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం.

First Published:  2 March 2019 12:06 AM GMT
Next Story