Telugu Global
Cinema & Entertainment

ఇంటిలిజెన్స్ ఏజెంట్ గా శ్రద్ధాకపూర్

మరికొన్ని గంటల్లో సాహో సినిమాను చాప్టర్-2 పేరిట మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం ఈ వీడియో రానుంది. ఇందులో ప్రభాస్ క్లిప్పింగ్ లు తక్కువగా, శ్రద్ధ వీడియోలు కాస్త ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ పోషిస్తున్న పాత్రపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది. రకరకాల కేసులు ఛేదించే ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా శ్రద్ధాకపూర్ ఇందులో కనిపించనుందట. ఈమేరకు డిపార్ట్ మెంట్ లో ఆమెకు మంచి పేరు […]

ఇంటిలిజెన్స్ ఏజెంట్ గా శ్రద్ధాకపూర్
X

మరికొన్ని గంటల్లో సాహో సినిమాను చాప్టర్-2 పేరిట మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం ఈ వీడియో రానుంది. ఇందులో ప్రభాస్ క్లిప్పింగ్ లు తక్కువగా, శ్రద్ధ వీడియోలు కాస్త ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ పోషిస్తున్న పాత్రపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.

రకరకాల కేసులు ఛేదించే ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా శ్రద్ధాకపూర్ ఇందులో కనిపించనుందట. ఈమేరకు డిపార్ట్ మెంట్ లో ఆమెకు మంచి పేరు కూడా వస్తుందట. అయితే ఓ కేసు చేధించడంలో మాత్రం శ్రద్ధాకపూర్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ప్రభాస్ సీన్ లోకి ఎంటరై శ్రద్ధాకపూర్ కు సహరిస్తాడు. ఇక అక్కడ్నుంచి వీళ్లిద్దరి మధ్య జర్నీ ప్రారంభం అవుతుందట.

సినిమాలో కేవలం పాటలు, కిస్సింగ్ సీన్స్ కు మాత్రమే పరిమితం కాకుండా.. యాక్షన్ సీన్స్ లో కూడా నటిస్తుంది శ్రద్ధాకపూర్. 2-3 సందర్భాల్లో ప్రభాస్ కు కీలక సమయాల్లో సహాయం కూడా చేస్తుందట. అంటే జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ గాళ్ టైపు అన్నమాట. మరి రేపు విడుదల కానున్న మేకింగ్ వీడియోలో శ్రద్ధాకు సంబంధించి ఎలాంటి క్లిప్పింగ్ లు విడుదల చేస్తారో చూడాలి

First Published:  2 March 2019 5:24 AM GMT
Next Story