Telugu Global
Cinema & Entertainment

ఈసారి షార్ట్ ఫిలింతో కొట్టబోతోంది?

మొన్నటివరకు ఆరోపణలతోనే సరిపెట్టింది. ఈసారి ఏకంగా కాస్టింగ్ కౌచ్ పై షార్ట్ ఫిలిం తీస్తోంది బాలీవుడ్ మాజీ హీరోయిన్ తనుశ్రీ దత్తా. దీంతో బాలవుడ్ సెలబ్రిటీల గుండెల్లో మరోసారి రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈమె చేసిన ఆరోపణలో నానా పటేకర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది. దీనికి సంబంధించి కేసు కూడా నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో షార్ట్ ఫిలిం రెడీ చేసింది తనుశ్రీ దత్తా. ఈసారి ఆమె ఎవర్ని టార్గెట్ చేసి […]

ఈసారి షార్ట్ ఫిలింతో కొట్టబోతోంది?
X

మొన్నటివరకు ఆరోపణలతోనే సరిపెట్టింది. ఈసారి ఏకంగా కాస్టింగ్ కౌచ్ పై షార్ట్ ఫిలిం తీస్తోంది బాలీవుడ్ మాజీ హీరోయిన్ తనుశ్రీ దత్తా. దీంతో బాలవుడ్ సెలబ్రిటీల గుండెల్లో మరోసారి రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈమె చేసిన ఆరోపణలో నానా పటేకర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది. దీనికి సంబంధించి కేసు కూడా నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో షార్ట్ ఫిలిం రెడీ చేసింది తనుశ్రీ దత్తా. ఈసారి ఆమె ఎవర్ని టార్గెట్ చేసి ఉంటుందనేది పెద్ద పాయింట్.

ఇండియాలో మీ-టూ ఉద్యమానికి ఓ ఊపు వచ్చింది తనుశ్రీ దత్తా నుంచే. ఆమె చేసిన ఆరోపణల తర్వాత కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరుగా నోరు విప్పడం స్టార్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఎంతోమంది ప్రముఖుల జాతకాల బట్టబయలయ్యాయి. దీని ప్రభావం వల్ల కొంతమంది ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇలాంటి టైమ్ లో షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తోంది తనుశ్రీ.

మొన్నటివరకు కాస్త స్తబ్దుగా ఉన్న మీ-టూ ఉద్యమం ఈ షార్ట్ ఫిలింతో మళ్లీ వేడి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమెన్స్ డే సందర్భంగా మార్చి 8న తన షార్ట్ ఫిలింను విడుదల చేస్తానంటోంది తనుశ్రీ.. అందులో ఎవరిపై ఆరోపణలు ఉండవని, కేవలం మహిళలను జాగృతం చేసేలా కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉంటాయంటోంది. ఆమె ఏమీ లేదన్నప్పటికీ, బాలీవుడ్ ను మాత్రం భయం వీడలేదు.

First Published:  2 March 2019 11:53 AM GMT
Next Story