Telugu Global
Cinema & Entertainment

118 మూవీ 2 రోజుల కలెక్షన్

ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేదు. ఉన్నంతలో 118 సినిమాపై మాత్రమే కాస్త బజ్ నడుస్తోంది. దీనికి తోడు వరుసగా 3 రోజులు సెలవులు. ఇవన్నీ కల్యాణ్ రామ్ కు బాగా కలిసొచ్చాయి. దీంతో 118 సినిమా రెండో రోజు కూడా డీసెంట్ వసూళ్లు రాబట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసింది. అటు నైజాంలో అరకోటికి పైగా షేర్ అందుకుంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర, సీడెడ్ కూడా పుంజుకోవడంతో […]

118 మూవీ 2 రోజుల కలెక్షన్
X

ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేదు. ఉన్నంతలో 118 సినిమాపై మాత్రమే కాస్త బజ్ నడుస్తోంది. దీనికి తోడు వరుసగా 3 రోజులు సెలవులు. ఇవన్నీ కల్యాణ్ రామ్ కు బాగా కలిసొచ్చాయి. దీంతో 118 సినిమా రెండో రోజు కూడా డీసెంట్ వసూళ్లు రాబట్టగలిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసింది. అటు నైజాంలో అరకోటికి పైగా షేర్ అందుకుంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర, సీడెడ్ కూడా పుంజుకోవడంతో 118 సేఫ్ వెంచర్ అనిపించుకునే దిశగా దూసుకుపోతుంది. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వచ్చిన 2 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 51 లక్షలు
సీడెడ్ – రూ. 21 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 20 లక్షలు
ఈస్ట్ – రూ. 11 లక్షలు
వెస్ట్ – రూ. 8 లక్షలు
గుంటూరు – రూ. 18 లక్షలు
కృష్ణా – రూ. 12 లక్షలు
నెల్లూరు – రూ. 4 లక్షలు

First Published:  3 March 2019 5:02 AM GMT
Next Story