Telugu Global
Cinema & Entertainment

మళ్లీ డేటింగ్ స్టార్ట్ చేసిన కంగనా

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టింది. ఓ వ్యక్తితో తను ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాననే విషయాన్ని బయటపెట్టింది కంగనా. అయితే ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పలేనని, అతడు ఏ రంగానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని కూడా వెల్లడించలేనంటోంది కంగన. గతంలో తను హృతిక్ రోషన్ తో డేటింగ్ చేశానంటూ కంగనా చెప్పుకుంది. దీన్ని హృతిక్ రోషన్ ఖండించాడు. అలా వాళ్లిద్దరి మధ్య చాలా […]

మళ్లీ డేటింగ్ స్టార్ట్ చేసిన కంగనా
X

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టింది. ఓ వ్యక్తితో తను ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాననే విషయాన్ని బయటపెట్టింది కంగనా. అయితే ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పలేనని, అతడు ఏ రంగానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని కూడా వెల్లడించలేనంటోంది కంగన.

గతంలో తను హృతిక్ రోషన్ తో డేటింగ్ చేశానంటూ కంగనా చెప్పుకుంది. దీన్ని హృతిక్ రోషన్ ఖండించాడు. అలా వాళ్లిద్దరి మధ్య చాలా వివాదం నడిచింది. హృతిక్ కు సంబంధించిన కొన్ని ఈ-మెయిల్స్ ను కంగనా బయటపెట్టింది. వాటిని హృతిక్ ఖండించాడు. అది తన ఈ-మెయిన్ ఖాతా కాదన్నాడు. ఆ తర్వాత కంగనా కొన్ని ఫొటోల్ని కూడా లీక్ చేసింది. ఇలా చాలా పెద్ద రచ్చ జరిగి ఫైనల్ గా వీళ్లిద్దరూ విడిపోయారు.

ఇలాంటి ఎన్నో అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని తెలిపిన కంగనా, ప్రస్తుతం డేటింగ్ కంటే తను ఓ తోడు కోరుకుంటున్నట్టు తెలిపింది. ఈ వయసులో డేటింగ్ లాంటివి చేయడం వృధా అని, ఓ తోడు మాత్రం కావాలని అంటోంది. కంగనా కామెంట్స్ తో ఆమె మనసులో ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో బాలీవుడ్ మీడియా వార్తలు వండి వారుస్తోంది. మరికొన్ని రోజుల్లో కంగనా మనసులో ఉన్న వ్యక్తిని బాలీవుడ్ మీడియా కచ్చితంగా కనిపెట్టి తీరుతుంది.

First Published:  3 March 2019 4:56 AM GMT
Next Story