Telugu Global
Cinema & Entertainment

సాహో నుంచి మరో మేకింగ్ వీడియో

షేడ్స్ ఆఫ్ సాహో పేరిట సాహో యూనిట్ మేకింగ్ వీడియోలు విడుదల చేసే కార్యక్రమాన్ని షురూ చేసిన విషయం తెలిసిందే. చాప్టర్-1 అంటూ ఇప్పటికే ప్రభాస్ పై ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు చాప్టర్-2 అంటూ మరో వీడియో విడుదల చేసింది. సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. సినిమా థీమ్ ను మరోసారి చాటిచెబుతూ, రెండో మేకింగ్ వీడియోలో కూడా యాక్షన్ మేకింగ్ షాట్స్ […]

సాహో నుంచి మరో మేకింగ్ వీడియో
X

షేడ్స్ ఆఫ్ సాహో పేరిట సాహో యూనిట్ మేకింగ్ వీడియోలు విడుదల చేసే కార్యక్రమాన్ని షురూ చేసిన విషయం తెలిసిందే. చాప్టర్-1 అంటూ ఇప్పటికే ప్రభాస్ పై ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు చాప్టర్-2 అంటూ మరో వీడియో విడుదల చేసింది. సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు.

సినిమా థీమ్ ను మరోసారి చాటిచెబుతూ, రెండో మేకింగ్ వీడియోలో కూడా యాక్షన్ మేకింగ్ షాట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాకు అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో వస్తోంది. ఇక ఈ నిమిషం వీడియోకు ప్రభాస్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను, భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  3 March 2019 1:55 AM GMT
Next Story