Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా ఆగిపోలేదు నమ్మండి!

మహేష్ లిస్ట్ లో సుకుమార్ తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు. సుకుమార్ తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లెక్కప్రకారం సందీప్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ నటించాలి. కానీ మధ్యలో అనీల్ రావిపూడి ఎంటర్ అయ్యేసరికి, సందీప్ తో చేయాల్సిన సినిమాపై అనుమానాలు పెరిగాయి. సందీప్ రెడ్డి, మహేష్ కాంబోలో రావాల్సిన సినిమా ఇక ఉండదని, ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్టేనంటూ కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే మహేష్ […]

ఆ సినిమా ఆగిపోలేదు నమ్మండి!
X

మహేష్ లిస్ట్ లో సుకుమార్ తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు. సుకుమార్ తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లెక్కప్రకారం సందీప్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ నటించాలి. కానీ మధ్యలో అనీల్ రావిపూడి ఎంటర్ అయ్యేసరికి, సందీప్ తో చేయాల్సిన సినిమాపై అనుమానాలు పెరిగాయి.

సందీప్ రెడ్డి, మహేష్ కాంబోలో రావాల్సిన సినిమా ఇక ఉండదని, ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్టేనంటూ కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే మహేష్ భార్య నమ్రతా రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డితో సినిమా కూడా ఉంటుందని మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ సినిమా కూడా ఉంటుందని తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం.. మహేష్-సందీప్ మధ్య ఫస్టాఫ్ కు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందట. అంతలోనే, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ పనిలో పడ్డాడు సందీప్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే, మహేష్ తో చేయాల్సిన ప్రాజెక్టుపై సందీప్ వర్క్ చేస్తాడని నమ్రత క్లారిటీ ఇచ్చారు.

First Published:  4 March 2019 2:46 AM GMT
Next Story