Telugu Global
Cinema & Entertainment

'ఇస్మార్ట్ శంకర్'లో నిధి కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్..!

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న సినిమా “ఇస్మార్ట్ శంకర్”. గత కొంత కాలంగా ఫ్లాప్స్‌లో ఉన్న ఈ ఇద్దరు కలిసి ఈ సినిమాతో ఎలాగైనా ‘ఇస్మార్ట్’గా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. చాలా రోజుల తర్వాత రామ్ పక్కా మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన నభా నటాష్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నభా […]

ఇస్మార్ట్ శంకర్లో నిధి కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్..!
X

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న సినిమా “ఇస్మార్ట్ శంకర్”. గత కొంత కాలంగా ఫ్లాప్స్‌లో ఉన్న ఈ ఇద్దరు కలిసి ఈ సినిమాతో ఎలాగైనా ‘ఇస్మార్ట్’గా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. చాలా రోజుల తర్వాత రామ్ పక్కా మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతుంది.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన నభా నటాష్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నభా నటాష్ పక్కా హైదరాబాదీ అమ్మాయిగా నటిస్తుండగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సృష్టించాడట పూరీ జగన్నాథ్. ఇంత వరకు తన సినిమాలో సైంటిస్ట్ పాత్రలను పూరీ పెట్టలేదు.. కాని ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతుంది.

ఈ పాత్ర కోసం నిధి అగర్వాల్ బాగానే గ్రౌండ్ వర్క్ చేసి కష్టపడింది అంట. ఎలాగో నిజ జీవితం సైంటిస్ట్ కాలేను కనీసం సినిమాలో అయిన సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అంటోందట. పూరి టూరింగ్ టాకీస్‌పై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఇదే సినిమాకి సీక్వెల్‌గా “డబుల్ ఇస్మార్ట్” సినిమా కూడా చేయాలని పూరీ భావిస్తున్నాడు.

First Published:  4 March 2019 11:33 PM GMT
Next Story