మహేష్ బాబుతో నటించే అవకాశం ఆ ఇద్దరిలో ఎవరికి ?

మహేష్ బాబు ఇటివలే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సుకుమార్ తో సినిమా ఉండట్లేదు అని అధికారికంగా ప్రకటించాడు. కానీ ఇదే గ్యాప్ లో వంశీ పైడిపల్లి “మహర్షి” సినిమా తరువాత అనిల్ రావిపుద్ సినిమాని లైన్ లో పెట్టాడు మహేష్ బాబు.

ఇటివలే “ఎఫ్ 2” సినిమాతో హిట్ ని అందుకున్న అనిల్ రావిపూడి కామెడీ సెన్స్ నచ్చి ఈ సినిమా అవకాశం ఇచ్చాడు అంట మహేష్ బాబు. ప్రస్తుతం అయితే అనిల్ రావిపూడి మహేష్ బాబు ఓకే చేసిన కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి లేదా రష్మిక ని హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్టు టాక్. రష్మిక అయితే మహేశ్ బాబు ముందు మరి చిన్న పిల్లలా అయిపోతుంది అని సాయి పల్లవి అయితే బెస్ట్ అని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు.

మరి ఈ ఇద్దరు హీరోయిన్స్ లో మహేష్ బాబు నటించే అవకాశం ఏ హీరోయిన్ చేజిక్కిచుకుంటుందో చూడాలి. దిల్ రాజు తో పాటు అనిల్ సుంకర కూడా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.