Telugu Global
NEWS

ప్లీజ్‌... నన్ను ప్రతిపాదించండి... పరిటాల శ్రీరామ్ ప్రయత్నాలు

వచ్చే ఎన్నికల్లో పోటీకి మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో సీటే అని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఆ నిబంధన నుంచి మినహాయింపు కోసం పరిటాల కుటుంబం ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పరిటాల శ్రీరాం పావులు కదుపుతున్నారు. ఇందు కోసం చంద్రబాబును ఒప్పించేందుకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలను కలుస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాస్ ను రాయదుర్గం వెళ్లి మరీ […]

ప్లీజ్‌... నన్ను ప్రతిపాదించండి... పరిటాల శ్రీరామ్ ప్రయత్నాలు
X

వచ్చే ఎన్నికల్లో పోటీకి మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో సీటే అని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఆ నిబంధన నుంచి మినహాయింపు కోసం పరిటాల కుటుంబం ప్రయత్నిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పరిటాల శ్రీరాం పావులు కదుపుతున్నారు. ఇందు కోసం చంద్రబాబును ఒప్పించేందుకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలను కలుస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాస్ ను రాయదుర్గం వెళ్లి మరీ కలిశారు పరిటాల శ్రీరాం.

తనకు టికెట్ ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలని కోరారు. టీడీపీ పొలిట్‌ బ్యూరోలో చంద్రబాబుకు తన మనసులో మాట చెప్పాలని కాల్వ శ్రీనివాస్‌ను శ్రీరాం విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇస్తే కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరాం భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఉన్నారు. రాప్తాడు నుంచి మరోసారి పోటీ చేయాలని పరిటాల సునీత భావిస్తున్నారు.

First Published:  4 March 2019 8:35 PM GMT
Next Story