డీఎల్‌… నీ వల్లేమవుతుంది?

టీడీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవాస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్ మండిపడ్డారు. టీడీపీని విమర్శించే అర్హత డీఎల్‌కు లేదన్నారు .

టీడీపీని కూకటివేళ్లతో పెకిలించడం మహామహుల చేతే కాలేదన్నారు. మరి డీఎల్‌ లాంటి వారి వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. తానెప్పుడూ డీఎల్‌పై కక్ష సాధింపుకు పాల్పడలేదన్నారు. డీఎల్ తరహాలో భూములు అక్రమించలేదని, అవినీతిని ప్రోత్సహించలేదని చెప్పారు. టీడీపీ పూర్తిగా అవినీతి రహిత పార్టీ అని చెప్పారు. తాను, తన తల్లి కమీషన్లు తీసుకున్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమన్నారు పుట్టా సుధాకర్.