Telugu Global
NEWS

సేవా మిత్ర కాదు....ద్రోహ మిత్ర : ఏపీ ప్రజల ఆగ్రహం

తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇన్నాళ్లు అవినీతి అక్రమాలకు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం పాలుపడిందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను కూడా సేకరించిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా మిత్ర పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరికి అందుతున్నాయో ఒక జాబితా తయారు చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా సేకరించడంపై 13 జిల్లాలకు చెందిన ప్రజలు కన్నెర్ర […]

సేవా మిత్ర కాదు....ద్రోహ మిత్ర : ఏపీ ప్రజల ఆగ్రహం
X

తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇన్నాళ్లు అవినీతి అక్రమాలకు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం పాలుపడిందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను కూడా సేకరించిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సేవా మిత్ర పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరికి అందుతున్నాయో ఒక జాబితా తయారు చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా సేకరించడంపై 13 జిల్లాలకు చెందిన ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, టీడీపీ సీనియర్ నాయకులు చేస్తున్న ప్రకటనలు పొంతన లేకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన 72 లక్షల మంది కార్యకర్తల సమాచారాన్ని మాత్రమే సేకరించామని ఒకసారి, తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరెవరికి చేరుతున్నాయో తెలుసుకునేందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారని మరో సారి చెప్పడం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇంతకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇలాగే వివరాల సేకరణ పేరుతో పూర్తిగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఆ చర్యలను కోర్టు తప్పు పట్టడం కూడా జరిగింది.

ఇప్పుడు మళ్లీ అదే పనిని ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత రహస్యంగా చేస్తుండడంతో ప్రజల్లో కోపం కట్టలు తెచ్చుకుంటోంది. “ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది స్నేహ మిత్ర కాదు… దోహా మిత్ర..” అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైదరాబాద్‌లోని కార్యాలయంలో నిక్షిప్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. నాలుగున్నర ఏళ్లు గడిచిన తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. తిరిగి రెండోసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తమ వ్యక్తిగత సమాచారంతో తమను ఇబ్బందులపాలు చేయడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల మీద తప్పులు చేస్తూ దొరికి పోతున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తప్పంతా ప్రతిపక్షాలు, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిపైకి నెట్టి వేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఈ దొంగ సమాచార సేకరణ తెలియడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అనేక అకృత్యాలు బయటపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  4 March 2019 9:26 PM GMT
Next Story