Telugu Global
NEWS

ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయాం... అందుకే అప్రమత్తంగా ఉన్నాం..

రెండేళ్ల క్రితం నుంచే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ వచ్చారన్నారు వైఎస్‌ జగన్ . గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్… డేటా చోరీ, ఓట్ల తొలగింపు అంశం రెండేళ్ల నుంచి చేస్తున్నారన్నారు. చంద్రబాబు రెండేళ్లుగా సైబర్‌ నేరానికి పాల్పడుతూ వచ్చారన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండకూడని ఆధార్‌ డేటా, ఓటర్ల డేటా … ప్రైవేట్ కంపెనీ కంప్యూటర్లలోకి, టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది నేరం కాదా అని జగన్ […]

ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయాం... అందుకే అప్రమత్తంగా ఉన్నాం..
X

రెండేళ్ల క్రితం నుంచే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ వచ్చారన్నారు వైఎస్‌ జగన్ . గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్… డేటా చోరీ, ఓట్ల తొలగింపు అంశం రెండేళ్ల నుంచి చేస్తున్నారన్నారు. చంద్రబాబు రెండేళ్లుగా సైబర్‌ నేరానికి పాల్పడుతూ వచ్చారన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండకూడని ఆధార్‌ డేటా, ఓటర్ల డేటా … ప్రైవేట్ కంపెనీ కంప్యూటర్లలోకి, టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది నేరం కాదా అని జగన్ ప్రశ్నించారు.

కేవలం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్‌ ఫోటోల ఓటర్ల జాబితా … టీడీపీ యాప్‌లోకి, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్దకు ఎలా వచ్చిందని జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలందరి బ్యాంకు అకౌంట్ల సమాచారం టీడీపీ యాప్‌లోకి, ప్రైవేట్‌ సంస్థ వద్దకు వచ్చిందంటే ఇంతకంటే నేరం ఉంటుందా అని జగన్ మండిపడ్డారు. ప్రజలకు సంబంధించి ఆధార్‌, ఓటర్, బ్యాంకు వివరాలన్నీ ఉంటే ఇక ఏం చేసినా ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ డేటా ఆధారంగా టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించే పక్రియ రెండేళ్లుగా చేస్తూ వచ్చారన్నారు. 2018 సెప్టెంబర్‌లో ఓట్ల జాబితా విడుదలైందని… దాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలించి 56 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామన్నారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ఈసారి కుట్రలు చేస్తారన్న ఉద్దేశంతో తాము అప్రమత్తంగా ఉంటూ వచ్చామన్నారు.

56 లక్షల దొంగ ఓట్లకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. జనవరికి వచ్చే సరికి మరో మూడు లక్షల దొంగ ఓట్లు పెరిగాయన్నారు. ప్రస్తుతం 59 లక్షలకు దొంగ ఓట్లు చేరాయన్నారు. దీనిపై మరోసారి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు.

దొంగ ఓట్లు గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా తాము ఫారం-7ను ఇస్తూ ఎన్నికల సంఘానికి సహకరిస్తున్నామన్నారు. అయితే దొంగ ఓట్ల తొలగింపు కార్యక్రమం జరగకూడదని చంద్రబాబు అడ్డుపడుతున్నారని జగన్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి, ఐటీ మంత్రులు జైలుకు వెళ్లాల్సిన నేరం చేశారన్నారు.

తప్పుడు పనిచేయడమే కాకుండా దీన్ని తెలంగాణ, ఆంధ్రా సమస్యగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగితే వెళ్లి ఏపీలో కేసు పెడుతారా అని ప్రశ్నించారు జగన్.

First Published:  6 March 2019 6:57 AM GMT
Next Story