Telugu Global
Cinema & Entertainment

మరోసారి వాయిదా పడ్డ "మహర్షి"

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దామని దిల్ రాజు ఫిక్స్ చేసాడు. కానీ షూటింగ్ ఇంకా పూర్తవక పోవడంతో దిల్ రాజు ఈ సినిమాని ఏప్రిల్ 25కి వాయిదా వేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాని ఆ రోజున కూడా […]

మరోసారి వాయిదా పడ్డ మహర్షి
X

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దామని దిల్ రాజు ఫిక్స్ చేసాడు. కానీ షూటింగ్ ఇంకా పూర్తవక పోవడంతో దిల్ రాజు ఈ సినిమాని ఏప్రిల్ 25కి వాయిదా వేశాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాని ఆ రోజున కూడా రిలీజ్ చేయట్లేదని చిత్ర బృందం చెబుతోంది. అవును “మహర్షి” సినిమాని దిల్ రాజు మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడంటా. అసలెందుకు ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసాడు అనే దానికి కారణాలు లేవు.

మహేశ్ బాబు ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్.. మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటిస్తుండగా పూజా హేగ్డే హీరోయిన్. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  6 March 2019 2:21 AM GMT
Next Story