Telugu Global
Cinema & Entertainment

రిలీజ్‌కి ముందే ప్రాఫిట్స్‌లో తేజు సినిమా..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “చిత్రలహరి”. ఫ్లాప్స్‌లో ఉండి పూర్తిగా మార్కెట్ డౌన్ అయిన సాయి ధరమ్ తేజ్‌కి ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో అవసరం. అందుకే ఆచి తూచి స్క్రిప్ట్ కోసం ఎక్కువ టైం తీసుకొని మరీ ఈ సినిమాని స్టార్ట్ చేసాడు తేజు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న […]

రిలీజ్‌కి ముందే ప్రాఫిట్స్‌లో తేజు సినిమా..!
X

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “చిత్రలహరి”. ఫ్లాప్స్‌లో ఉండి పూర్తిగా మార్కెట్ డౌన్ అయిన సాయి ధరమ్ తేజ్‌కి ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో అవసరం. అందుకే ఆచి తూచి స్క్రిప్ట్ కోసం ఎక్కువ టైం తీసుకొని మరీ ఈ సినిమాని స్టార్ట్ చేసాడు తేజు.

కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న రిలీజ్‌కి సిద్దం అవుతున్న ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు, అలాగే సరిగమ సినిమాస్ వారు ఈ సినిమాని ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. తేజు ఫ్లాప్స్‌లో ఉన్నా కూడా ఈ సినిమా ద్వారా రిలీజ్‌కి ముందే మంచి బజ్‌ని సంపాదించుకోగలిగాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  6 March 2019 12:57 AM GMT
Next Story