Telugu Global
CRIME

'డేటా చోరీ' కేసులో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసుకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును ఇకపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేపట్టనుంది. ఈ మేరకు డేటా చోరీ కేసులో సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇంచార్జిగా ఉండే ఈ సిట్‌లో సైబర్ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, […]

డేటా చోరీ కేసులో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
X

తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసుకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును ఇకపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేపట్టనుంది.

ఈ మేరకు డేటా చోరీ కేసులో సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇంచార్జిగా ఉండే ఈ సిట్‌లో సైబర్ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండనున్నారు.

ఐటీ గ్రిడ్స్ సంస్థ చేసిన ఏపీలోని ప్రజల డేటాను అనధికారికంగా సేకరించిన కేసుకు సంబంధించి హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇప్పటి వరకు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ప్రస్తుతం తీవ్రతరం కావడంతో పాటు.. ఏపీలోని అధికార టీడీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌లే ఈ కుట్రకు తెరలేపారంటూ విమర్శలు గుప్పించారు. ఈ కేసు ఇరు రాష్ట్రాల్లో కీలకంగా మారండంతో పాటు కేంద్ర సంస్థలైన ఆధార్, ఎన్నికల సంఘాన్ని కూడా మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.

దీంతో ఈ కేసునకు సంబంధించి సిట్ ఏర్పాటు చేయడమే సరైన మార్గమని భావించి సీఎం కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిట్ కార్యాలయం కోసం తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఒక ఛాంబర్ కేటాయించారు.

First Published:  6 March 2019 9:03 AM GMT
Next Story