Telugu Global
NEWS

అంచనాలు తప్పడంతో.... బాబు గిలగిల....

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వరుస తప్పులతో ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. 40ఏళ్ల అనుభవంతో 46 ఏళ్ల జగన్‌ను ఎదుర్కొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో తన అనుభవంతో బీజేపీ, జనసేన ఇలా అందరినీ కలుపుకుని గట్టెక్కిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని ప్రశాంతంగా ఆస్వాదించినట్టు కనిపించదు. ఓడినా సరే ఆ వెంటనే జగన్‌ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి దిగడంతో అధికార పార్టీకి తొలి నుంచి కూడా ఊపిరి సలపడం […]

అంచనాలు తప్పడంతో.... బాబు గిలగిల....
X

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వరుస తప్పులతో ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. 40ఏళ్ల అనుభవంతో 46 ఏళ్ల జగన్‌ను ఎదుర్కొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో తన అనుభవంతో బీజేపీ, జనసేన ఇలా అందరినీ కలుపుకుని గట్టెక్కిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని ప్రశాంతంగా ఆస్వాదించినట్టు కనిపించదు.

ఓడినా సరే ఆ వెంటనే జగన్‌ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి దిగడంతో అధికార పార్టీకి తొలి నుంచి కూడా ఊపిరి సలపడం లేదు. జగన్‌ ఒత్తిడిని భరించలేక చంద్రబాబు తన మిత్రులనే దూరం చేసుకోవాల్సి వచ్చింది. నిర్ణయాలు మార్చుకుంటూ యూ టర్న్ సీఎం అన్న ముద్ర వేయించుకున్నారు.

తాజాగా ఓటుకు నోటు వీడియో గానీ, ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారం గానీ, సాయం చేసేందుకు మరో పార్టీ ముందుకు రాకపోవడం గానీ ఇవన్నీ గమనిస్తే…. చంద్రబాబు అతి విశ్వాసం, వ్యవస్థలను శాసించగలనన్న అతి నమ్మకం ఆయనను దెబ్బ తీశాయి అనిపిస్తుంది.

జగన్‌ తొలి నుంచి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదు… ప్యాకేజీ తీసుకోవడం బెటర్ అని వాదించారు. తన మీడియా సాయంతో ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఉండదంటూ సాగించిన ప్రచారం వల్ల ఒక దశలో ప్రజలు కూడా హోదా అయ్యే పని కాదన్న అభిప్రాయానికి వచ్చారు.

కానీ జగన్‌ పట్టు వదలకుండా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించడంతో చంద్రబాబు తత్తరపాటుకు గురయ్యారు. హోదా ఇవ్వని ఎన్‌డీఏలో టీడీపీ మంత్రులు ఎలా ఉన్నారంటూ పదేపదే జగన్‌ ప్రశ్నించడం, ప్రజలు కూడా జగన్‌ వాదనను విశ్వసిస్తున్నారని తెలుసుకున్నాకే చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారు.

ఈ స్టాండ్‌ మార్చుకునే క్రమంలో చంద్రబాబు రాజకీయంగా చేసిన పెద్ద పొరపాటు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం. దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోతుందని చంద్రబాబు భ్రమ పడడం, రాష్ట్రంలో పరిపాలనలో ఫెయిల్ కావడం, ఆ వైఫల్యాన్ని కేంద్రానికి అంటగట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీయే నుంచి బయటకు వచ్చారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఏం చేస్తున్నారని జగన్ పదేపదే ప్రశ్నించడంతో కూడా ఆ ఒత్తిడి భరించలేక మోడీని చంద్రబాబు దూరం చేసుకున్నారు. తన పాలనలో వైఫల్యాలను కేంద్రంపైకి నెట్టి వేయవచ్చన్న ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు ఎత్తు తిరగబడింది.

టీడీపీ- బీజేపీ మధ్య బంధం తెగిపోవడంతో జగన్‌కు మరింత దూకుడు పెంచే అవకాశం ఏర్పడింది. కేంద్రం అండతో ఓటుకు నోటు వ్యవహారం నుంచి కూడా తాత్కాలికంగా చంద్రబాబు అప్పట్లో గట్టెక్కారు. కేంద్ర పెద్దలు చెప్పడంతో ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్‌ కూడా రాజీ పడక తప్పలేదు. కానీ జగన్‌ ను ఎదుర్కోవడానికి ఎన్‌డీఏ స్నేహానికి గుడ్‌బై చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ఒంటరైపోయారు.

తాజాగా ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ పీకల్లోతుల్లో చిక్కుకుంది. ఈసారి కూడా జుట్టు తెలంగాణ ప్రభుత్వం చేతికే దొరికింది. అయితే ఇప్పుడు రాజీ చేసేందుకు వెంకయ్యనాయుడు లేరు. చంద్రబాబును గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో స్నేహమూ లేదు.

సరే తన వైఫల్యాలను కేంద్రం పై నెట్టేసి రాజకీయంగానైనా లబ్దిపొందుదామా అంటే … ఆ ఎత్తు కూడా ఫలించడం లేదు. ఏపీలో నామమాత్రపు ఓట్లు ఉన్న బీజేపీ కంటే… ఇప్పుడు టీడీపీనే ఎక్కువగా నష్టపోతోంది.

జగన్‌ ప్రత్యేక హోదా నినాదం వినిపించినా… చంద్రబాబు ప్యాకేజీకే కట్టుబడి బీజేపీతో స్నేహాన్ని కొనసాగించి ఉంటే ఇప్పుడు బాబుకు ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు.

First Published:  7 March 2019 2:18 AM GMT
Next Story