ధోనీ ఫామ్ హౌస్ లో టీమిండియాకు అదిరేటి విందు

  • రాంచీలో విరాట్ సేనకు విందు ఏర్పాటు చేసిన సాక్షి- ధోనీ
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేకి రాంచీ ఆతిథ్యం
  • మూడేళ్ల విరామం తర్వాత రాంచీలో వన్డే మ్యాచ్

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ…రాంచీలోని తన హోంగ్రౌండ్ వేదికగా ఆఖరి వన్డే ఆడటానికి ఎదురు చూస్తున్నాడు.

జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మూడో వన్డేలో పాల్గొనటానికి వచ్చిన టీమిండియా సభ్యులకు రాంచీలోని తమ ఫామ్ హౌస్ లో…ధోనీ-సాక్షి జంట చక్కటి విందు ఇచ్చారు.

ఈ ప్రత్యేక విందులో కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. అంతేకాదు…కేదార్ జాదవ్, రిషభ్ పంత్ లను…. తన హమ్మర్ బ్రాండ్ కారులో ఎక్కించుకొని మరీ ధోనీ రాంచీ రోడ్లపైన చక్కర్లు కొట్టాడు.

మొత్తం మీద ధోనీ దంపతులు తమ ఫామ్ హౌస్ లో విందు ఏర్పాటు చేసి…కొసరి కొసరి వడ్డించడంతో… విరాట్ అండ్ కో గాల్లో తేలిపోతున్నారు. మూడో వన్డేను సైతం నెగ్గి… ధోనీకి సిరీస్ ను కానుకగా ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు.