Telugu Global
Cinema & Entertainment

ఇది లేటెస్ట్ మూవీ కాదు.... లేట్ మూవీ

టైమ్ బాగాలేనప్పుడు సినిమాలు రిలీజ్ చేయరు. ఎంచక్కా పక్కన పడేస్తారు. ఆ టైమ్ లో అభిప్రాయ భేదాలు రావడం, ఫైనాన్షియర్స్ తో ఇబ్బందులు ఎదురవ్వడం లాంటి కారణాల వల్ల కొన్ని సినిమాలు అలా మరుగున పడిపోతుంటాయి. అలాంటి సినిమా ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. రాజశేఖర్ హీరో. అవును.. దాదాపు మూడేళ్ల కిందటే అర్జున అనే సినిమా చేశాడు రాజశేఖర్. కాకపోతే అప్పుడు ఈ యంగ్రీ స్టార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పైగా ఆర్థిక కష్టాలు. […]

ఇది లేటెస్ట్ మూవీ కాదు.... లేట్ మూవీ
X

టైమ్ బాగాలేనప్పుడు సినిమాలు రిలీజ్ చేయరు. ఎంచక్కా పక్కన పడేస్తారు. ఆ టైమ్ లో అభిప్రాయ భేదాలు రావడం, ఫైనాన్షియర్స్ తో ఇబ్బందులు ఎదురవ్వడం లాంటి కారణాల వల్ల కొన్ని సినిమాలు అలా మరుగున పడిపోతుంటాయి. అలాంటి సినిమా ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. రాజశేఖర్ హీరో.

అవును.. దాదాపు మూడేళ్ల కిందటే అర్జున అనే సినిమా చేశాడు రాజశేఖర్. కాకపోతే అప్పుడు ఈ యంగ్రీ స్టార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పైగా ఆర్థిక కష్టాలు. దీంతో అర్జున్ సినిమాను అటకెక్కించేశారు. అలా కనుమరుగైపోయిన ఈ సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఈనెల 15న అర్జున సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమా ఎలా వెలుగుచూసిందో తెలుసా? ప్రస్తుతం రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేస్తున్నాడు నిర్మాత సి.కల్యాణ్. మాటల సందర్భంలో ఈ సినిమా టాపిక్ కూడా వచ్చింది. అప్పుడే ఈ సినిమా గురించి తెలుసుకున్న సి.కల్యాణ్, వెంటనే మూవీని తన ప్రొడక్షన్ బ్యానర్ పై విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అర్జున సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

First Published:  7 March 2019 9:00 AM GMT
Next Story