Telugu Global
Cinema & Entertainment

మహేష్ ఆఫర్ కు సాయిపల్లవి నో

మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ ఫిక్స్ అయింది. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీలో రష్మిక లేదా సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం కూడా ఉంది. ఇప్పటికే సాయిపల్లవితో దర్శకుడు చర్చలు సాగించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఎగిరి గంతేయడం మాట అటుంచి, ఏకంగా ఆ ఆఫర్ నే తోసిపుచ్చింది సాయిపల్లవి. […]

మహేష్ ఆఫర్ కు సాయిపల్లవి నో
X

మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ ఫిక్స్ అయింది. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీలో రష్మిక లేదా సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం కూడా ఉంది. ఇప్పటికే సాయిపల్లవితో దర్శకుడు చర్చలు సాగించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఎగిరి గంతేయడం మాట అటుంచి, ఏకంగా ఆ ఆఫర్ నే తోసిపుచ్చింది సాయిపల్లవి. అలా యూనిట్ కు భలే షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

హీరో ఎవరనేది కాదు, ఆ ప్రాజెక్టులో తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది సాయిపల్లవికి చాలా ముఖ్యం. అందుకే సినిమాల్లో ఆమె పాత్రలు అంతలా ఎలివేట్ అవుతుంటాయి. మహేష్-అనీల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ క్యారెక్టర్ చేయడానికి సాయిపల్లవి అంగీకరించలేదు.

జస్ట్ గ్లామర్ డాళ్ గా కనిపించడం తనకు ఇష్టముండదని, పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు ఒప్పుకుంటానని ఆమె పదేపదే చెబుతూ వస్తోంది. అయినప్పటికీ తెలుగు నుంచి ఆమెకు కమర్షియల్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయి. అందుకే తెలుగులో ఆమె లిమిటెడ్ గా సినిమాలు చేస్తోంది. మహేష్ – అనీల్ రావిపూడి సినిమాను కూడా వదులుకోవడానికి ఇదే కారణం.

First Published:  7 March 2019 6:00 AM GMT
Next Story