Telugu Global
National

న్యూ ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి గంభీర్..?

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్దమవుతున్నారా..? రాజకీయాల్లో తన ప్రతిభను నిరూపించేందుకు ఈ సారి జరిగే ఎన్నికలనే వేదికగా మలుచుకుంటున్నారా? అంటే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. దేశరాజధాని పరిధిలోని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు గంభీర్ సిద్దంగా ఉన్నాడని.. దీనికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అనుకూలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల […]

న్యూ ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి గంభీర్..?
X

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్దమవుతున్నారా..? రాజకీయాల్లో తన ప్రతిభను నిరూపించేందుకు ఈ సారి జరిగే ఎన్నికలనే వేదికగా మలుచుకుంటున్నారా? అంటే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.

దేశరాజధాని పరిధిలోని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు గంభీర్ సిద్దంగా ఉన్నాడని.. దీనికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అనుకూలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు.

ఇవాళ ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా న్యూఢిల్లీ స్థానం పైనే చర్చ జరిగింది. అక్కడి నుంచి గౌతమ్ గంభీర్‌ను పోటీకి దింపితే తప్పక గెలుస్తాడనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో 7 ఎంపీ స్థానాలు ఉండగా.. న్యూఢిల్లీ స్థానం మాత్రం కీలకమైన రాజధాని పరిధిలో (ఎన్‌సీఆర్) ఉంది.

ఇక దీనిపై గౌతమ్ గంభీర్ ఇంకా స్పందించలేదు. అయితే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక తన అడుగులు రాజకీయాల వైపు అన్నట్లుగా సోషల్ మీడియాలో సందేశాలు పంపుతుంటారు. పలు అంశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సమర్ధించారు.

ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ రాజకీయాల్లో కూడా గౌతమ్ తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో లోకల్ బాయ్‌గా మంచి క్రేజ్ ఉన్న గౌతమ్ గంభీర్ అయితేనే ఆ సీటుకు న్యాయం చేస్తాడని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మీనాక్షీ లేఖీనికి సీటు సర్థుబాటు ఎలా చేయాలో కూడా పార్టీ తలమునకలై ఉన్నట్లు సమాచారం.

First Published:  8 March 2019 6:46 AM GMT
Next Story