Telugu Global
Cinema & Entertainment

వర్మ డైరక్ట్ ఎటాక్

మొన్నటివరకు పరోక్షంగా సెటైర్లు వేశాడు వర్మ. ట్విట్టర్ లో రకరకాల ఫొటోలు పెడుతూ చంద్రబాబును తెగ విమర్శించాడు. మధ్యమధ్యలో నందమూరి కుటుంబంపై కూడా సెటైర్లు పడ్డాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వర్మ మరో అడుగు ముందుకేశాడు. ఈసారి డైరక్ట్ ఎటాక్ షురూ చేశాడు. అది కూడా ట్రయిలర్ తో. అవును.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి మరో ట్రయిలర్ విడుదల చేశాడు వర్మ. అసలు విషయాన్ని పరోక్షంగా చెబుతాడని భావించిన ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ […]

వర్మ డైరక్ట్ ఎటాక్
X

మొన్నటివరకు పరోక్షంగా సెటైర్లు వేశాడు వర్మ. ట్విట్టర్ లో రకరకాల ఫొటోలు పెడుతూ చంద్రబాబును తెగ విమర్శించాడు. మధ్యమధ్యలో నందమూరి కుటుంబంపై కూడా సెటైర్లు పడ్డాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వర్మ మరో అడుగు ముందుకేశాడు. ఈసారి డైరక్ట్ ఎటాక్ షురూ చేశాడు. అది కూడా ట్రయిలర్ తో.

అవును.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి మరో ట్రయిలర్ విడుదల చేశాడు వర్మ. అసలు విషయాన్ని పరోక్షంగా చెబుతాడని భావించిన ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన ఎన్నో విషయాల్ని, మరీ ముఖ్యంగా వెన్నుపోటు ఉదంతాన్ని ట్రయిలర్ లో కళ్లకుకట్టినట్టు చూపించాడు. తద్వారా టీడీపీ, నందమూరి కుటుంబంపై వర్మ డైరక్ట్ ఎటాక్ షురూ చేసినట్టయింది.

వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారంటూ గతంలో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డారు. సరిగ్గా అదే డైలాగ్ తో ట్రయిలర్ ను స్టార్ట్ చేశాడు వర్మ. ఇక అక్కడ్నుంచి 2 నిమిషాల 40 సెకెన్ల నిడివి ఉన్న ట్రయిలర్ లో వరుసగా బాంబ్ లు వేస్తూనే వచ్చాడు వర్మ. మార్చి 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

First Published:  8 March 2019 8:21 AM GMT
Next Story