Telugu Global
Cinema & Entertainment

సీత రిలీజ్ డేట్ ఫిక్స్

తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి కాజల్ స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్, పనిలోపనిగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 25న సీత థియేటర్లలోకి రాబోతోంది. సీత రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిన వెంటనే మహేష్ స్థానాన్ని ఆక్రమించిన కాజల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ మొదలైంది. దీనికి కారణం అందరికీ […]

సీత రిలీజ్ డేట్ ఫిక్స్
X

తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి కాజల్ స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్, పనిలోపనిగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 25న సీత థియేటర్లలోకి రాబోతోంది.

సీత రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిన వెంటనే మహేష్ స్థానాన్ని ఆక్రమించిన కాజల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ మొదలైంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 25న మహేష్ నటిస్తున్న మహర్షి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం కారణంగా ఆ సినిమాను మే నెలకు వాయిదా వేశారు. ఇది జరిగిన 2 రోజులకే, సీత వచ్చి ఆ స్థానాన్ని అందరికంటే ముందు ఆక్రమించేసింది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో హీరో కంటే హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందట. క్లైమాక్స్ లో మాత్రం హీరో రెయిజ్ అవుతాడని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Here is #SITA wishing all the ladies a Happy Women’s Day#DirectorTeja Kajal Aggarwal Mannara Sonu Sood Anup Rubens AK Entertainments #SitaOnApril25th #InternationalWomensDay

Posted by Bellamkonda Sreenivas on Friday, 8 March 2019

First Published:  8 March 2019 8:09 AM GMT
Next Story