Telugu Global
NEWS

అక్కడ అధికారులపై పెత్తనం ప్రభుత్వానిది కాదు.... పార్టీదే....

“ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులు, శాసనసభ్యులు, లోక్‌ సభ సభ్యులు, మంత్రులు మాత్రమే కాదు కార్యకర్తలు కూడా మా పై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర సీనియర్ నాయకులకు మొరపెట్టుకున్నా వాళ్ళు చెప్పింది వినాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు” ఇది ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియర్ అధికారులు గా ఉన్న వారి మాట. పోలీసు, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ […]

అక్కడ అధికారులపై పెత్తనం ప్రభుత్వానిది కాదు.... పార్టీదే....
X

“ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులు, శాసనసభ్యులు, లోక్‌ సభ సభ్యులు, మంత్రులు మాత్రమే కాదు కార్యకర్తలు కూడా మా పై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర సీనియర్ నాయకులకు మొరపెట్టుకున్నా వాళ్ళు చెప్పింది వినాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు” ఇది ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియర్ అధికారులు గా ఉన్న వారి మాట.

పోలీసు, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఇదే మాట చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని, పెండింగ్ లో ఉన్న పనులు, బిల్లులు క్లియర్ చేయాలంటూ అధికారులను మానసికంగా వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పాస్ చేస్తే అనంతరం ఎవరు అధికారంలో ఉంటారో తెలియక తాము ఇబ్బందుల్లో పడతామని అధికారులు చెబుతున్నారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని సీనియర్ నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ కు చెందిన ఉన్నతాధికారులపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న కేసులు మాఫీ చేయాలి అంటూ పోలీస్ శాఖ పైన, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన బిల్లులు మంజూరు చేయాలంటూ రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల పైన తెలుగు తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తున్నారని అధికారులు వాపోతున్నారు.

గతంలో కూడా ఎన్నికల ముందు ఇలాంటి ఒత్తిడి కొద్దిగా ఎదుర్కొన్నామని, నేటి పరిస్థితులతో చూస్తే ఆనాటి పరిస్థితులు ఎంతో బాగున్నాయని వారు అంటున్నారు. అధికార పార్టీ తీరుతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రానున్న ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారని వారు చెబుతున్నారు.

First Published:  7 March 2019 8:12 PM GMT
Next Story