Telugu Global
NEWS

తెలంగాణకు ఏపీనే బాకీ ఉంది " సీఎండీ ప్రభాకర్‌రావు

డేటా చోరీ కేసు నేపథ్యంలో మరో సారి ఆంధ్రా, తెలంగాణ మధ్య పేరుకున్న అప్పులు తెరపైకి వచ్చాయి. తమ విద్యుత్ వాడుకుని తెలంగాణ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. వెంటనే తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖను ఆదేశించారు. కాగా, ఈ వివాదంపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బకాయిలపై ఏపీ ప్రభుత్వం […]

తెలంగాణకు ఏపీనే బాకీ ఉంది  సీఎండీ ప్రభాకర్‌రావు
X

డేటా చోరీ కేసు నేపథ్యంలో మరో సారి ఆంధ్రా, తెలంగాణ మధ్య పేరుకున్న అప్పులు తెరపైకి వచ్చాయి. తమ విద్యుత్ వాడుకుని తెలంగాణ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. వెంటనే తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖను ఆదేశించారు.

కాగా, ఈ వివాదంపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బకాయిలపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. అన్ని లెక్కలు సరి చూసుకుంటే తెలంగాణకే ఏపీ ప్రభుత్వం 2,046 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ సంస్థలకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుందాం అని అడిగినా.. ఏపీ విద్యుత్ సంస్థలు 5,600 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆరోపిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)కి పిర్యాదు చేశారని ప్రభాకర్‌రావు అన్నారు.

రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి రావాలని ఎన్ని లేఖలు రాసినా ఏపీ ప్రభుత్వం స్పందించకుండా ఎన్‌సీఎల్టీకి వెళ్లడం వెనుక అంతరార్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే 24 గంటల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు 5,785 కోట్ల రూపాయలు రావాలని.. ఏపీ డిస్కంల నుంచి 1,659 కోట్లు, జెన్‌కో నుంచి 3,096 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఏపీ ప్రభుత్వానికి అక్కడి విద్యుత్ సంస్థలకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని.. తెలంగాణకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి ఇతర సంస్థల నుంచి విద్యుత్ కొంటున్నామని ఆయన అన్నారు.

First Published:  8 March 2019 7:12 AM GMT
Next Story