Telugu Global
Cinema & Entertainment

మరోసారి విజయ్ సరసన శాలిని పాండే

విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” సినిమాతో తొలిసారి హిట్ అందుకున్నా కూడా….. విజయ్ కి మాస్ ఇమేజ్ తో పాటు స్టార్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టిన సినిమా “అర్జున్ రెడ్డి”. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని “అర్జున్ రెడ్డి” కి ముందు “అర్జున్ రెడ్డి” తరువాత అనే రేంజ్ లో హిట్ అయ్యింది ఆ సినిమా. ఇక ఆ సినిమాలో […]

మరోసారి విజయ్ సరసన శాలిని పాండే
X

విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” సినిమాతో తొలిసారి హిట్ అందుకున్నా కూడా….. విజయ్ కి మాస్ ఇమేజ్ తో పాటు స్టార్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టిన సినిమా “అర్జున్ రెడ్డి”.

సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని “అర్జున్ రెడ్డి” కి ముందు “అర్జున్ రెడ్డి” తరువాత అనే రేంజ్ లో హిట్ అయ్యింది ఆ సినిమా.

ఇక ఆ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రీతి గా శాలిని పాండే నటించింది. అయితే ఇప్పుడు ఈ భామ మళ్లీ చాలా కాలం తరువాత విజయ్ సరసన రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది.

అవును విజయ్ దేవరకొండ ఇటీవలే తమిళ దర్శకుడు అయిన ఆనంద్ అన్నామలై చెప్పిన కథకి ఓకే చెప్పాడు. బైక్ రేసింగ్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన శాలినిని హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

ఒకవేళ ఈ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే ఆ సినిమా పై మంచి అంచనాలు నెలకొంటాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు.

First Published:  8 March 2019 5:58 AM GMT
Next Story