Telugu Global
NEWS

టీవీ 5 ని వెలివేసిన వైసీపీ

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఈ రోజు మరో ఛానల్ ను వెలివేసింది. గతంలో ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతిని నిషేధిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా టీవీ 5 ను కూడా నిషేధిస్తూ పత్రికా ప్రకటన జారీ చేసింది. మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఆ పార్టీకి బాజాగా పనిచేస్తున్న టీవీ 5 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వార్తలను వక్రీకరిస్తున్నందుకు ఆగ్రహించిన వైసీపీ టీవీ 5 ను దూరంగా పెట్టింది. ఇక ఈరోజు […]

టీవీ 5 ని వెలివేసిన వైసీపీ
X

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఈ రోజు మరో ఛానల్ ను వెలివేసింది. గతంలో ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతిని నిషేధిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా టీవీ 5 ను కూడా నిషేధిస్తూ పత్రికా ప్రకటన జారీ చేసింది.

మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఆ పార్టీకి బాజాగా పనిచేస్తున్న టీవీ 5 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వార్తలను వక్రీకరిస్తున్నందుకు ఆగ్రహించిన వైసీపీ టీవీ 5 ను దూరంగా పెట్టింది. ఇక ఈరోజు నుంచి టీవీ 5లో చర్చలకు వైసీపీ వాళ్ళు ఎవరూ పాల్గొనవద్దని పార్టీ ఆదేశించింది. అలాగే తమ పార్టీ వాళ్ళను పిలవవద్దని టీవీ 5కు స్పష్టం చేసింది.

వైసీపీ పార్టీ కార్యక్రమాలకు గానీ, ప్రెస్‌ మీట్‌లకు గానీ కవరేజ్‌ కి రాకుండా టీవీ 5 ను నిషేధించింది.

జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా పనిచేస్తున్న సంస్థల గురించి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తెలియజేసేందుకే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రకటించింది.

టీడీపీ చాలా కాలం క్రితమే సాక్షిని నిషేధించిన విషయం మనందరికీ తెలిసిందే.

First Published:  8 March 2019 1:09 AM GMT
Next Story