Telugu Global
NEWS

రాంచీ వన్డేలో టీమిండియాకు కంగారూ దెబ్బ

టీమిండియాను ఆదుకోని విరాట్ ఫైటింగ్ సెంచరీ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఫాస్టెస్ట్ రికార్డు ఆఖరి రెండువన్డేలకూ ధోనీ దూరం టీమిండియాతో రాంచీ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల విజయంతో …సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. ధోనీ హోంగ్రౌండ్ జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 313 పరుగుల భారీ […]

రాంచీ వన్డేలో టీమిండియాకు కంగారూ దెబ్బ
X
  • టీమిండియాను ఆదుకోని విరాట్ ఫైటింగ్ సెంచరీ
  • కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఫాస్టెస్ట్ రికార్డు
  • ఆఖరి రెండువన్డేలకూ ధోనీ దూరం

టీమిండియాతో రాంచీ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల విజయంతో …సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది.

ధోనీ హోంగ్రౌండ్ జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 313 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డే క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 300కు పైగా స్కోరు సాధించడం ఆసీస్ కు ఇది వందోసారి.

సమాధానంగా 314 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా తరపున కెప్టెన్ విరాట్ కొహ్లీ ఒంటరిపోరాటం చేసి…. సూపర్ సెంచరీ సాధించినా పరాజయం తప్పలేదు.

టీమిండియా 48.2 ఓవర్లలో 281 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ , సెంచరీ హీరో ఉస్మాన్ క్వాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని నాలుగో వన్డే…మొహాలీలో సూపర్ సండే ఫైట్ గా జరుగుతుంది.

విరాట్ కొహ్లీ ఫాస్టెస్ట్ రికార్డు….

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసుకొన్నాడు. రాంచీ వేదిగా ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా…అత్యంతవేగంగా 4 వేల పరుగులు సాధించిన వన్డే కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ అధిగమించాడు. ఏబీ డివిలియర్స్ సఫారీ కెప్టెన్ హోదాలో కేవలం 77 ఇన్నింగ్స్ లో 4 వేల పరుగులు సాధిస్తే…విరాట్ కొహ్లీ మాత్రం 63 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

వన్డే కెప్టెన్లు గా ఇంతకు ముందే 4వేల పరుగుల మైలురాయిని చేరిన మహ్మద్ అజరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ,సౌరవ్ గంగూలీల సరసన చోటుసంపాదిచాడు.

భారత వన్డే కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ 6 వేల 641 పరుగులు సాధిస్తే…మహ్మద్ అజరుద్దీన్ 5వేల 239 పరుగులు, సౌరవ్ గంగూలీ 5వేల 104 పరుగులు నమోదు చేశారు. ఈ ఘనతసాధించిన భారత నాలుగో కెప్టెన్ గా, వన్డే క్రికెట్ చరిత్రలోనే 12వ కెప్టెన్ గా రికార్డుల్లో కొహ్లీ చేరాడు.

రాంచీలో టీమిండియా రెండో ఓటమి…

రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో వన్డేలో సైతం ఆతిథ్య టీమిండియాకు పరాజయం తప్పలేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల ఓటమి చవిచూసింది. రాంచీ వేదికగా ఇప్పటి వరకూ ఐదు వన్డేలు ఆడిన టీమిండియా 2 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

అంతేకాదు…ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా 49 విజయాలు సాధించిన టీమిండియా…75 పరాజయాలు చవిచూసింది. మరో 10 మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి. రెండో ర్యాంకర్ టీమిండియా, 6వ ర్యాంకర్ ఆసీస్ జట్ల నాలుగో వన్డే…మొహాలీ వేదికగా ..సూపర్ సండే ఫైట్ గా జరుగనుంది.

ఆఖరి రెండువన్డేలకూ ధోనీ దూరం….

ఆస్ట్రేలియాతో జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేల నుంచి సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది.

మొహాలీ, న్యూఢిల్లీ వేదికలుగా జరిగే ఆఖరి రెండు వన్డేలలో యువఆటగాడు రిషభ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తాడు.

కాలిగాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి సైతం విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

హోంగ్రౌండ్ రాంచీ వేదికగా తన ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన ధోనీ 26 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగాడు.

First Published:  9 March 2019 8:05 AM GMT
Next Story