Telugu Global
Cinema & Entertainment

పుకార్లకు చెక్ పెట్టిన నాని

ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా విడుదల తేదీపై మొన్నటివరకు ఓ రకమైన సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. జెర్సీ సినిమాను ఏప్రిల్ 19న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నిజానికి జెర్సీ సినిమాను ఏప్రిల్ 19నే విడుదల చేస్తామని మేకర్స్ పదేపదే చెబుతూ వస్తున్నారు. […]

పుకార్లకు చెక్ పెట్టిన నాని
X

ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా విడుదల తేదీపై మొన్నటివరకు ఓ రకమైన సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. జెర్సీ సినిమాను ఏప్రిల్ 19న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

నిజానికి జెర్సీ సినిమాను ఏప్రిల్ 19నే విడుదల చేస్తామని మేకర్స్ పదేపదే చెబుతూ వస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. నాగచైతన్య నటించిన మజిలీ సినిమాతో జెర్సీ పోటీపడుతుందని కొందరు చెప్పకొచ్చారు. మరికొందరు మాత్రం మహేష్ వదిలేసిన ఏప్రిల్ 25కు జెర్సీ వస్తుందని వాదించారు. ఇలా రెండు రకాల పుకార్లు షికార్లు చేయడంతో మేకర్స్ ఈసారి మరింత క్లారిటీ ఇచ్చారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది జెర్సీ సినిమా. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో శ్రద్ధా శ్రీనాద్ తెలుగు పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

First Published:  9 March 2019 11:01 AM GMT
Next Story