Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ పుట్టినరోజుకి అల్లు అర్జున్ హంగామా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడినా కూడా ఇప్పటి వరకు సినిమా పూజా కార్యక్రమాలు మొదలవలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా గ్రాండ్ గా లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక అదే రోజు సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి అనేది అల్లు అర్జున్ […]

రామ్ చరణ్ పుట్టినరోజుకి అల్లు అర్జున్ హంగామా
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడినా కూడా ఇప్పటి వరకు సినిమా పూజా కార్యక్రమాలు మొదలవలేదు.

అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా గ్రాండ్ గా లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక అదే రోజు సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి అనేది అల్లు అర్జున్ ప్లాన్.

సో ఈ విధంగా చేస్తే అటు రామ్ చరణ్ అభిమానులతో పాటు…. ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోతారని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. ఈ సినిమాని గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక అదే రోజు “ఆర్.ఆర్.ఆర్” టీం నుంచి కూడా రామ్ చరణ్ మంచి గిఫ్ట్ ఉంటుంది అనేది టాక్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.

First Published:  8 March 2019 10:50 PM GMT
Next Story