Telugu Global
National

దూరదర్శన్ కలలో కూడా ఊహించి ఉండదు.... తమ ట్యూన్‌కి ఇలా డ్యాన్స్ చేయొచ్చని !

ఇప్పడంటే టీవీలో వందల ఛానెల్స్ వస్తున్నాయి. సినిమాలకి ఒకటి, వార్తలకు మరొకటి.. మ్యూజిక్‌కి ఒకటి, స్పోర్ట్స్‌కి మరోటి.. సీరియల్స్, వంటలు, ట్రావెల్, వైల్డ్ లైఫ్…. ఇలా ప్రతీ జోనర్‌కి ఒక ఛానల్ పుట్టుకొచ్చాయి. వందల సంఖ్యలో ఉన్న ఈ ఛానల్స్‌లో ఏం చూడాలా అని తలలు పట్టుకుంటుంటాం. అయితే ఇవేమీ లేని రోజుల్లో ఉన్నది దూరదర్శన్ ఒక్కటే. 80, 90 దశకాల్లో దూరదర్శన్ తప్ప వేరే ఛానల్ లేదు. ఆనాటి టీవీ ప్రేక్షకులకు దూరదర్శన్ ఐకానిక్ ట్యూన్ […]

దూరదర్శన్ కలలో కూడా ఊహించి ఉండదు.... తమ ట్యూన్‌కి ఇలా డ్యాన్స్ చేయొచ్చని !
X

ఇప్పడంటే టీవీలో వందల ఛానెల్స్ వస్తున్నాయి. సినిమాలకి ఒకటి, వార్తలకు మరొకటి.. మ్యూజిక్‌కి ఒకటి, స్పోర్ట్స్‌కి మరోటి.. సీరియల్స్, వంటలు, ట్రావెల్, వైల్డ్ లైఫ్…. ఇలా ప్రతీ జోనర్‌కి ఒక ఛానల్ పుట్టుకొచ్చాయి. వందల సంఖ్యలో ఉన్న ఈ ఛానల్స్‌లో ఏం చూడాలా అని తలలు పట్టుకుంటుంటాం. అయితే ఇవేమీ లేని రోజుల్లో ఉన్నది దూరదర్శన్ ఒక్కటే.

80, 90 దశకాల్లో దూరదర్శన్ తప్ప వేరే ఛానల్ లేదు. ఆనాటి టీవీ ప్రేక్షకులకు దూరదర్శన్ ఐకానిక్ ట్యూన్ గుర్తుండే ఉంటుంది. ఆ ట్యూన్‌ని ఇట్టే గుర్తు పట్టేస్తాము. కాని ఈ మధ్య ఆ ట్యూన్‌ని కూడా మర్చిపోయాం. కాని ఇది మళ్లీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దానికి కారణం వైశాఖ్ నాయర్.

స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన నాయర్.. దూరదర్శన్ ఐకానిక్ ట్యూన్‌కి బ్రేక్ డ్యాన్స్ చేసి ‘టిక్ టాక్’లో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఎవరో ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో అతని డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైకులు, రీట్వీట్లు చేస్తూ వైరల్ చేశారు. చివరకు దూరదర్శన్ కూడా ఈ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయి లైక్ కొట్టడమే కాక రీట్వీట్ చేసింది.

ఇక నెటిజన్లు అయితే.. ‘దూరదర్శన్ కలలో కూడా ఊహించి ఉండదు’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇక డీడీ డైరెక్టర్ జనరల్ సుప్రియా సాహు ఐఏఎస్ తన ట్విట్టర్‌ ఎకౌంట్ లో ఈ వీడియో షేర్ చేసి.. అత్యంత అద్భుతంగా ఉందీ డ్యాన్స్.. భారత హృదయ స్పందన అయిన డీడీ ట్యూన్‌కి చక్కని డ్యాన్స్ ఇది అంటూ అభినందించారు.

First Published:  10 March 2019 12:40 AM GMT
Next Story