నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. 2019 లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. దీనికి సంబంధించి మీడియా సమావేశాన్ని సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు.

సీఈసీ సునీల్ అరోరా నిర్వహించే ఈ ప్రెస్‌మీట్లో ఎన్నికలు ఎన్ని దశల్లో, ఏయే ప్రాంతాల్లో జరుగుతాయో వివరిస్తారు. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇక ఇవాళ సాయంత్రం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోనికి రానుంది.