Telugu Global
Cinema & Entertainment

మహేష్, సుకుమార్ మధ్యలోకి నిర్మాత

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ కాబోతుందని చాలా ఆసక్తిగా ఎదురుచూసారు మహేష్ బాబు అభిమానులు. కానీ మహేష్ బాబు వారందరినీ షాక్ కి గురి చేస్తూ సుకుమార్ ప్రాజెక్ట్ రద్దయిందని చెప్పుకొచ్చాడు. మరో పక్క సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమాని కూడా స్టార్ట్ చేసే పనిలో పడిపోయాడు. అయితే కేవలం క్రియేటివ్ గా వచ్చిన కొన్ని ప్రాబ్లంస్ వల్లే వీళ్ళ కాంబినేషన్ లో […]

మహేష్, సుకుమార్ మధ్యలోకి నిర్మాత
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ కాబోతుందని చాలా ఆసక్తిగా ఎదురుచూసారు మహేష్ బాబు అభిమానులు. కానీ మహేష్ బాబు వారందరినీ షాక్ కి గురి చేస్తూ సుకుమార్ ప్రాజెక్ట్ రద్దయిందని చెప్పుకొచ్చాడు.

మరో పక్క సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమాని కూడా స్టార్ట్ చేసే పనిలో పడిపోయాడు. అయితే కేవలం క్రియేటివ్ గా వచ్చిన కొన్ని ప్రాబ్లంస్ వల్లే వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఆగిపోయిందని మహేష్ బాబు అధికారికంగా ప్రకటించాడు.

ఇక ఇప్పుడు ఈ విషయంలో మహేష్ బాబు ని మరోసారి సుకుమార్ తో కూర్చొని మాట్లాడమని మైత్రి మూవీ మేకర్స్ లో ఒక నిర్మాతగా ఉన్న నవీన్ చెప్పాడట. ఈ మేరకు సుకుమార్ నిన్న సాయంత్రం మహేష్ బాబుని కలిసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ మహేష్ బాబు సుకుమార్ కథకి ఓకే చెప్పినా కూడా ఇప్పట్లో సినిమా స్టార్ట్ చెయ్యలేడు.

ఎందుకంటే అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం ఆల్రెడీ కథ చేసి రెడీ గా ఉంచాడు. మరో పక్క అభిమానులకి సినిమా ఆగిపోయింది అని చెప్పి…. మళ్ళీ అదే సినిమా స్టార్ట్ చేస్తే లేని పోనీ అనుమానాలు వస్తాయి అనేది మహేష్ బాబు భయం.

First Published:  10 March 2019 2:17 AM GMT
Next Story