Telugu Global
Cinema & Entertainment

టైటిల్ వదులుకోక తప్పదా నాని!

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను అట్టహాసంగా ప్రకటించాడు నాని. ప్రకటించిన రోజే టీజర్ కూడా రిలీజ్ చేసి టైటిల్ లోగో వదిలారు. కానీ ఇప్పుడా వ్యవహారం మొత్తం రివర్స్ లో కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. అవును.. గ్యాంగ్ లీడర్ సినిమాపై మరో వివాదం మొదలైంది. ఈ టైటిల్ తనదే అంటున్నాడు ఓ నిర్మాత. మాణిక్యం మూవీస్ బ్యానర్ పై మోహనకృష్ణ అనే నిర్మాత ఈ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడట. అది కూడా ఇప్పుడు కాదు. […]

టైటిల్ వదులుకోక తప్పదా నాని!
X

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను అట్టహాసంగా ప్రకటించాడు నాని. ప్రకటించిన రోజే టీజర్ కూడా రిలీజ్ చేసి టైటిల్ లోగో వదిలారు. కానీ ఇప్పుడా వ్యవహారం మొత్తం రివర్స్ లో కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. అవును.. గ్యాంగ్ లీడర్ సినిమాపై మరో వివాదం మొదలైంది. ఈ టైటిల్ తనదే అంటున్నాడు ఓ నిర్మాత.

మాణిక్యం మూవీస్ బ్యానర్ పై మోహనకృష్ణ అనే నిర్మాత ఈ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడట. అది కూడా ఇప్పుడు కాదు. దాదాపు 6 నెలల కిందటే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను తను రిజిస్టర్ చేయించానని వాదిస్తున్నాడు మోహనకృష్ణ. అలాంటిది ఆ టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అక్రమంగా లాక్కున్నారని వాపోతున్నాడు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాధను వెళ్లగక్కాడు మోహనకృష్ణ. ఉగాది రోజున గ్యాంగ్ లీడర్ పేరిట తన కొత్త సినిమాను విడుదల చేస్తానంటున్నాడు మోహనకృష్ణ.

అయితే చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న నాని సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అంటే నాని-విక్రమ్ కుమార్ సినిమా కంటే ముందు ఈ గ్యాంగ్ లీడర్ థియేటర్లలోకి వస్తుందన్నమాట. ఈ వివాదంపై నాని అండ్ టీం ఇంకా రియాక్ట్ అవ్వలేదు.

First Published:  9 March 2019 11:04 PM GMT
Next Story