Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్ దర్శకుడు.. అంతా ఉత్తిదే!

త్వరలోనే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ సినిమా…. ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఫిక్స్…. మహేష్ బాబు ప్రశాంత్ మధ్య కథాచర్చలు…. ఈమధ్య కాలంలో ఇలా తరుచుగా వార్తల్లో నలుగుతున్న వ్యక్తి ఈ ప్రశాంత్. ఇంతకీ ఇతడెవరో తెలుసా.. కేజీఎఫ్ సినిమాతో ఇండియా మొత్తాన్ని ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు ఇతడే. అందుకే సౌత్ లో ఇతడికి క్రేజ్ పెరిగింది. ఇలా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ అంటూ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందులో నిజమెంత? లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. […]

కేజీఎఫ్ దర్శకుడు.. అంతా ఉత్తిదే!
X

త్వరలోనే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ సినిమా…. ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఫిక్స్…. మహేష్ బాబు ప్రశాంత్ మధ్య కథాచర్చలు…. ఈమధ్య కాలంలో ఇలా తరుచుగా వార్తల్లో నలుగుతున్న వ్యక్తి ఈ ప్రశాంత్.

ఇంతకీ ఇతడెవరో తెలుసా.. కేజీఎఫ్ సినిమాతో ఇండియా మొత్తాన్ని ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు ఇతడే. అందుకే సౌత్ లో ఇతడికి క్రేజ్ పెరిగింది. ఇలా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ అంటూ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందులో నిజమెంత?

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవానికి దూరం కూడా కాదు. 10శాతం మాత్రమే నిజం, 90శాతం ఊహాగానాలున్నాయు. ముందుగా ఎన్టీఆర్ విషయానికొద్దాం. ప్రశాంత్ వద్ద ఓ కథ ఉంది. దాన్ని ఎన్టీఆర్ కు వినిపిద్దాం అనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించాడు. ప్రశాంత్ ను కచ్చితంగా పిలిపిస్తానని, ప్రస్తుతానికైతే వద్దని చెప్పేశాడు.

ఇక ప్రభాస్ విషయానికొద్దాం. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. సాహోతో పాటు రాధాకృష్ణ దర్సకత్వంలో సినిమాలు ఉండడంతో భవిష్యత్తులో కచ్చితంగా కలుద్దామంటూ చెప్పి పంపించాడు. ఇక మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తన లిస్ట్ లో ఉన్న ముగ్గురు నలుగురు దర్శకుల జాబితాలోకి ప్రశాంత్ ను చేర్చేశాడు.

ఇలా ప్రస్తుతానికైతే ఏ హీరోతో సినిమాకు కమిట్ అవ్వలేదు ప్రశాంత్. అంతేకాదు, వచ్చేనెల నుంచి కేజీఎఫ్ చాప్టర్-2ను స్టార్ట్ చేయబోతున్నాడు ఈ హీరో. అదన్నమాట సంగతి.

First Published:  10 March 2019 7:00 AM GMT
Next Story