Telugu Global
Cinema & Entertainment

రానా, రాజ్ తరుణ్ సినిమా

వెండితెరపైకి మరో కాంబినేషన్ కాబోతోంది. ఈసారి రానా, రాజ్ తరుణ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే వీళ్లిద్దరూ కలిసి తెరను పంచుకోవడం లేదు. కేవలం ప్రాజెక్టును మాత్రమే పంచుకుంటున్నారు. అవును.. రానా నిర్మాత, రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన పోస్టర్ బాయ్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు రానా. ఈ మేరకు ఆ సినిమా రైట్స్ కూడా దక్కించుకున్నాడు. ఈ రీమేక్ లో రాజ్ తరుణ్ అయితే […]

రానా, రాజ్ తరుణ్ సినిమా
X

వెండితెరపైకి మరో కాంబినేషన్ కాబోతోంది. ఈసారి రానా, రాజ్ తరుణ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే వీళ్లిద్దరూ కలిసి తెరను పంచుకోవడం లేదు. కేవలం ప్రాజెక్టును మాత్రమే పంచుకుంటున్నారు. అవును.. రానా నిర్మాత, రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

మరాఠిలో సూపర్ హిట్ అయిన పోస్టర్ బాయ్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు రానా. ఈ మేరకు ఆ సినిమా రైట్స్ కూడా దక్కించుకున్నాడు. ఈ రీమేక్ లో రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని రానా ఫీలింగ్. సరైన హిట్ లేక అల్లాడుతున్న రాజ్ తరుణ్ కూడా రానా ప్రపోజల్ కు ఓకే చెప్పేశాడు. సో.. సినిమా సెట్ అయిపోయినట్టే. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక ఉంది.

పోస్టర్ బాయ్ రీమేక్ రైట్స్ ను అక్షయ్ కుమార్ తో కలిసి దక్కించుకున్నాడు రానా. సో.. అక్షయ్ ను కూడా ఈ రీమేక్ లో ఓ నిర్మాతగా చేర్చుకుంటాడా.. లేక అక్కీని రాయల్టీ ఇచ్చి తనే మొత్తం హక్కులు దక్కించుకుంటాడా అనేది చూడాలి. త్వరలోనే తన కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించబోతున్నాడు రానా. ఆ వెంటనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా రాబోతోంది. ఈ గ్యాప్ లో దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్. వచ్చేవారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

First Published:  10 March 2019 3:46 AM GMT
Next Story