Telugu Global
Cinema & Entertainment

భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాతలు?

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  అన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అనుకున్న విధంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ తో అందరికీ షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం సినిమా దర్శక నిర్మాతలు 75 కోట్లు డిమాండ్ […]

భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు?
X

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అనుకున్న విధంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ తో అందరికీ షాక్ ఇస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం సినిమా దర్శక నిర్మాతలు 75 కోట్లు డిమాండ్ చేశారు. ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నప్పటికీ 75 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవచ్చు.

చైనా జపాన్ దేశాల్లో కాక మిగతా అన్ని దేశాల లోని థియేట్రికల్ రైట్స్ దీని కిందకే వస్తాయి. ఒకవేళ బయ్యర్లు అంత పెట్టి కొన్నప్పటికీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదేవిధంగా కాసుల వర్షం కురిపించాల్సి ఉంటుంది. ఇక షూటింగ్ లోని తదుపరి షెడ్యూల్ కోసం కోల్ కతా వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది ఈ చిత్ర బృందం.

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  10 March 2019 10:00 AM GMT
Next Story