Telugu Global
NEWS

సమయం లేదు మిత్రమా....

ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే… అన్ని రాజకీయ పార్టీలు సమయం లేదు మిత్రమా అని ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొంది.  ఎన్నికలకు ఇంకా సమయం ఉంటుందని భావించిన […]

సమయం లేదు మిత్రమా....
X

ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే… అన్ని రాజకీయ పార్టీలు సమయం లేదు మిత్రమా అని ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

ఎన్నికలకు ఇంకా సమయం ఉంటుందని భావించిన పార్టీలు ఇంకా అభ్యర్ధులను ఎంపిక చేసే పనిని పూర్తి చేయలేదు. అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అభ్యర్ధుల జాబితాలతో సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికను చేపట్టాల్సి ఉంది. దీంతో అందరూ సమయం లేదు మిత్రమా డైలాగ్ నే వల్లే వేసే అవకాశం ఉంటుందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో అభ్యర్ధుల ఎంపికలో సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షుడికి మధ్య తీవ్ర స్ధాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల స్వీకరిస్తారు. 28 వ తేదిన నామినేషన్లకు ఉపసంహరణ. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ, 175 శాసనసభ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్ సభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

లోక్ సభకు అభ్యర్ధలు ఎంపిక పట్ల ఇబ్బందులు లేకపోయినా శాసనసభ అభ్యర్ధుల ఎంపిక మాత్రం కీలకంగా మారనుందని అంటున్నారు. తక్కువ సమయం ఉండడంతో దాని ప్రభావం అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అలకలు తీర్చడం…. బుజ్జగింపులు….. ఎన్నికలకు సమాయత్త పరచడం వంటివి తెలుగుదేశం పార్టీకి చాలా ఇక్కట్లు తీసుకువస్తుందని అంటున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, టీ.జీ.వెంకటేష్, కె.ఈ.ప్రభాకర్, గంటా శ్రీనివాస రావుతో సహా ఇతర నాయకులను బుజ్జగించి వారిని ఎన్నికల రణరంగంలోకి దించడం అనేది చంద్రబాబు నాయుడికి కత్తి మీద సాము వంటిదే.

First Published:  10 March 2019 7:40 AM GMT
Next Story