Telugu Global
Cinema & Entertainment

కథ రెడీ అయ్యింది కానీ డైరెక్టర్ లేడు

అక్కినేని నాగ చైతన్యకి ఒక గట్టి హిట్ పడి చాలా కాలం అయ్యింది. గత ఏడాది చైతు నటించిన “శైలజా రెడ్డి అల్లుడు” “సవ్యసాచి” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాల తరువాత ప్రస్తుతం చైతు “మజిలి” అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్కినేని సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక […]

కథ రెడీ అయ్యింది కానీ డైరెక్టర్ లేడు
X

అక్కినేని నాగ చైతన్యకి ఒక గట్టి హిట్ పడి చాలా కాలం అయ్యింది. గత ఏడాది చైతు నటించిన “శైలజా రెడ్డి అల్లుడు” “సవ్యసాచి” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

ఆ సినిమాల తరువాత ప్రస్తుతం చైతు “మజిలి” అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్కినేని సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ తో కలిసి నటిస్తున్న “వెంకీ మామ” షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. ఈ రెండు సినిమాల తరువాత చైతు విజయేంద్ర ప్రసాద్ రాసిన ఒక కథలో నటించనున్నాడట. ఈ కథ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన “దేవదాస్” సినిమాని పోలి ఉంటుందట.

“దేవదాస్” నుంచి కొన్ని లైన్స్ ని తీసుకొని ఈ కథని రెడీ చేసాడట విజయేంద్ర ప్రసాద్. కథ అయితే రెడీ అయ్యింది కానీ ఈ సినిమా కోసం కరెక్ట్ డైరెక్టర్ మాత్రం దొరకట్లేదట. ప్రస్తుతానికి అయితే చైతు, విజయేంద్ర ప్రసాద్ ఈ కథ కోసం డైరెక్టర్ ని వెతికే పనిలో ఉన్నారు.

First Published:  9 March 2019 11:15 PM GMT
Next Story