Telugu Global
NEWS

అరసం అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్‌ జర్నలిస్టు ఆర్వీ రామారావు

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షునిగా ఆర్వీ రామారావును ఎన్నుకున్నారు. సీనియర్‌ జర్నలిస్టు అయిన ఆర్వీ రామారావు గత నలభై ఏళ్ళుగా పలు పత్రికల్లో ముఖ్య భూమికను పోషించారు. అనేక సంవత్సరాల పాటు కొన్ని వందల సంపాదకీయాలు రాశారు. కొన్ని వేల వ్యాసాలు రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆర్వీ రామారావు ఏ అంశం మీదనైనా సాధికారికంగా వ్యాసాలు రాయగలరు. ఆయన మార్గదర్శకత్వంలో కొన్ని వందల మంది జర్నలిస్టులు రూపుదిద్దుకున్నారు. ఆయన గొప్ప పత్రికా రచయితే కాకుండా […]

అరసం అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్‌ జర్నలిస్టు ఆర్వీ రామారావు
X

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షునిగా ఆర్వీ రామారావును ఎన్నుకున్నారు. సీనియర్‌ జర్నలిస్టు అయిన ఆర్వీ రామారావు గత నలభై ఏళ్ళుగా పలు పత్రికల్లో ముఖ్య భూమికను పోషించారు. అనేక సంవత్సరాల పాటు కొన్ని వందల సంపాదకీయాలు రాశారు. కొన్ని వేల వ్యాసాలు రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆర్వీ రామారావు ఏ అంశం మీదనైనా సాధికారికంగా వ్యాసాలు రాయగలరు.

ఆయన మార్గదర్శకత్వంలో కొన్ని వందల మంది జర్నలిస్టులు రూపుదిద్దుకున్నారు. ఆయన గొప్ప పత్రికా రచయితే కాకుండా ఆయన గురువు గజ్జెల మల్లారెడ్డి లాగా మహా వక్త. అనర్గళంగా ఉపన్యసించగలరు.

ఆదివారం హన్మకొండలోని ఆదర్శ న్యాయకళాశాలలో అరసం రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో అధ్యక్షుడితో పాటు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. అరసం అధ్యక్షునిగా ఆర్వీ రామారావును ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ రాపోలు సుదర్శన్‌ను, ఉపాధ్యక్షులుగా బొమ్మగాని నాగభూషణం, శ్రీ నిధి లను ఎన్నుకున్నారు.

First Published:  11 March 2019 12:40 AM GMT
Next Story